Manchu Manoj | తండ్రి అయిన మంచు మనోజ్

Manchu Manoj - హీరో మంచు మనోజ్ తండ్రి అయ్యాడు. మౌనిక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement
Update:2024-04-13 23:01 IST

హీరో మంచు మనోజ్ తండ్రి అయ్యాడు. అతడి భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంచు మనోజ్ గతేడాది మౌనికను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. మంచు మనోజ్ కి ఇదివరకే పెళ్లయి విడాకులు కాగా.. భూమా మౌనికకి అప్పటికే ధైరవ్ అనే బాబు ఉన్నాడు. ఇక తమ మొదటి భాగస్వామ్యులతో విడాకులు తీసుకున్న వీరు ఇద్దరు ప్రేమలో పడి గతేడాది పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తరువాత వీరిద్దరూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచారు. కలిసి చాలా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో గత డిసెంబర్ లో మౌనిక ప్రెగ్నెంట్ అని ప్రకటించాడు మనోజ్.

ఇక ఈ ప్రెగ్నెన్సీ న్యూస్ బయట పెట్టిన కొద్దిరోజులకే బేబీ బంప్ ఫొటోలని షేర్ చేశాడు మనోజ్. అలాగే సీమంతం కూడా చేశారు. ఇక వీరి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఈరోజు మనోజ్ కి పాప పుట్టినట్టు ప్రకటించింది అతడి అక్క మంచు లక్ష్మి.

పుట్టిన పాపకు 'ఎమ్ఎమ్ పులి' అని ముద్దు పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ కాగా మంచు మనోజ్ ఫ్యామిలీకి అభిమానులు అందరూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News