Maname movie | తన ఫేవరెట్ సినిమా అంటున్న దర్శకుడు

Maname movie - మనమే మూవీ తన ఫేవరెట్ అంటున్నాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. సినిమా విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు.

Advertisement
Update:2024-06-02 22:35 IST

శర్వానంద్ కెరీర్ లో 35వ మూవీ 'మనమే'. ఇదొక ఫుల్ లెంగ్త్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది. జూన్ 7న సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మూవీ విశేషాలని మీడియా సమావేశంలో పంచుకున్నాడు.

"మనమే నా ఫేవరేట్ జోనర్. నాకు హ్యుమర్ చాలా ఇష్టం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో మనమే నా మోస్ట్ ఫేవరేట్ ఫిల్మ్. మా అబ్బాయి యాక్ట్ చేశాడనే ఒక రీజన్ ఉంది కానీ సినిమా చూసినప్పుడు మీరే అర్ధమౌతుంది. ఇందులో చైల్డ్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ నుంచి విక్రమ్ ఆదిత్యనే అనుకున్నాం. తను కెమరాకి చాలా బావుంటాడనిపించింది."

మనమే సినిమాలో ఏకంగా 16 పాటలున్నాయట. వీటిలో బిట్ సాంగ్స్ ఎక్కువగా ఉన్నాయని, మెయిన్ సాంగ్స్ 7 ఉన్నాయని చెబుతున్నాడు దర్శకుడు. 

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ