Mahesh restaurant: వెజ్, నాన్-వెజ్ కోసం 2 రెస్టారెంట్లు

Mahesh restaurant : మహేష్ పెట్టిన హోటల్ కి 3 బోర్డులు తగిలించారు. దీని వెనుక రీజన్ ఏంటి

Advertisement
Update:2022-12-08 15:08 IST

 ఒక్క షాపుకు 3 బోర్డులు తగిలించారు. దీంతో అంతా అయోమయానికి గురయ్యారు. అదేదో చిన్న షాప్ అయితే అంతా లైట్ తీసుకుంటారు. కానీ అది స్వయంగా మహేష్ బాబు స్థాపించిన రెస్టారెంట్. అలాంటి దానికి 3 పేర్లు పెట్టడంతో గందరగోళం ఏర్పడింది. ఎట్టకేలకు దీనిపై వివరణ ఇచ్చింది మహేష్ భార్య నమ్రత. 


ఏషియన్ గ్రూప్, మహేష్ కలిసి హైదరాబాద్ లో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు. దీనికి 3 బోర్డులు తగిలించారు. ఒకవైపు మినర్వా కాఫీషాప్, మరోవైపు ప్యాలెస్ హైట్స్, మధ్యలో ఏఎన్ అనే పేర్లు పెట్టారు. వీటిపై నమ్రత వివరణ ఇచ్చారు. అంతా ఒకటేనని ప్రకటించారు.


నిజానికి 2 అంతస్తుల్లో వెలిసింది ఈ రెస్టారెంట్. కింద దాని పేరు మినర్వా కాఫీషాప్. ఇది పూర్తిగా శాకాహార రెస్టారెంట్. ఇక్కడ కాఫీ, టీ లాంటి పానీయాలతో పాటు టిఫిన్లు, భోజనాలు ఉంటాయి. అన్నీ వెజిటేరియన్.


ఇక పైన పెట్టిన రెస్టారెంట్ పేరు ప్యాలెస్ హైట్స్. ఇది పూర్తిగా నాన్-వెజ్ రెస్టారెంట్. హైదరాబాద్ బిర్యానీ నుంచి ఏషియన్ నాన్-వెజ్ రుచుల వరకు చాలా ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. 


ఇక మధ్యలో పెట్టిన ఏఎన్ అనే పదానికి అర్థం ఏషియన్-నమ్రత. ఇకపై ఏఎన్ పేరిట దేశవ్యాప్తంగా రెస్టారెంట్ ఛెయిన్ ఏర్పాటుచేస్తామని తెలిపింది నమ్రత. అదీ సంగతి.

Tags:    
Advertisement

Similar News