Guntur Kaaram | మహేష్ బాబు సినిమా సాంగ్ రిలీజ్ ఎప్పుడు?

Mahesh Babu Guntur Kaaram - ఎట్టకేలకు గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఓ సాంగ్ కు ఓకే చెప్పాడు మహేష్. త్వరలోనే ఈ లిరికల్ వీడియో రిలీజ్ అవుతుంది.

Advertisement
Update:2023-08-14 08:33 IST

మహేష్ బాబు తాజా చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అప్ డేట్స్ తక్కువ, పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు నటీనటులు, టెక్నీషియన్స్ పై చాలా ఊహాగానాలు చెలరేగాయి. తాజాగా సినిమాలో సాంగ్స్ పై కథనాలు మొదలయ్యాయి.

ఈ సినిమాకు సంబంధించి తమన్ ఇప్పటికే 4 సాంగ్స్ కంపోజ్ చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ పాటలన్నింటినీ మహేష్ బాబు రిజెక్ట్ చేశాడంట. అతడికి ఒక్కటంటే ఒక్క పాట కూడా నచ్చలేదంట. కొన్ని రోజుల కిందట మరో సాంగ్ కూడా కంపోజ్ చేసి వినిపించారట.

ఒకవేళ ఆ సాంగ్ ఓకే అయితే, మహేష్ బాబు బర్త్ డేకు విడుదల చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ మహేష్ కు ఆ పాట కూడా నచ్చలేదని, అందుకే పుట్టినరోజుకు పాట రిలీజ్ కాలేదనే ప్రచారం నడిచింది.

అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. గుంటూరు కారం సినిమాకు సంబంధించి మహేష్ బాబు ఓ సాంగ్ ఓకే చేశాడు. ఆ పాటకు సంబంధించి లిరికల్ వీడియో వర్క్ ఆల్రెడీ మొదలైంది. అయితే అంతా అనుకుంటున్నట్టు, ఆ సాంగ్ ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వడం లేదు.

పూర్తిస్థాయిలో లిరికల్ వీడియో రెడీ అయిన తర్వాత, అప్పుడు విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ గ్యాప్ లో గుంటూరుకారం సినిమా మరోసారి సెట్స్ పైకి రాబోతోంది. ఆల్రెడీ మహేష్ బాబు, విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 16 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News