అసలైన పండగ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’

’సంక్రాంతికి వస్తున్నాం‘ సినిమాను ఎంజాయ్‌ చేశా. అసలైన పండగ సినిమా ఇది అని మహేశ్‌బాబు ప్రశంస

Advertisement
Update:2025-01-15 19:35 IST

వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ . సంక్రాంతి సందర్భంగా మంగళవారం విడుదలైన ఈ మూవీపై మహేశ్‌బాబు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ’సంక్రాంతికి వస్తున్నాం‘ సినిమాను ఎంజాయ్‌ చేశా. అసలైన పండగ సినిమా ఇది. వెంకటేశ్‌ యాక్టింగ్‌ అదుర్స్‌. వరుస విజయాలు అందుకున్న మా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడిని చూస్తుంటే గర్వంగా, ఆనందంగా ఉన్నది. ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బుల్లిరాజు పాత్రలో కనిపించిన బాలుడి నటన అద్భుతం అని పేర్కొన్నారు.

పాటలు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్నది. అందులోని కామెడీ ఆడియన్స్‌కు మంచి వినోదం పంచింది. మొదటిరోజు ఈ సినిమా రూ. 45 కోట్లు వసూళ్లు చేసినట్లు టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఓవర్సిస్‌లో ఫస్ట్‌ డే 7 లక్షల డాలర్లు రాబట్టింది. వెంకటేశ్‌ కెరీర్‌లోనే ఈస్థాయి వసూల్లు రావడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ సినిమాలోని 'గోదారి గట్టు మీద' పాట యూట్యూబ్‌లో 100 మిలియన్‌కు పైగా వ్యూస్‌ దక్కించుకోవడం విశేషం.

Tags:    
Advertisement

Similar News