Guntur Kaaram Movie OTT: ఓటీటీలోకి గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Guntur Kaaram Movie OTT: గుంటూరు కారం సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ దీనిపై ప్రకటన చేసింది.
Guntur Kaaram Movie OTT: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజే సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని భావించినా అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 250 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.
గుంటూరు కారం సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ దీనిపై ప్రకటన చేసింది. ఇన్నాళ్లు రౌడీ రమణని 70 ఎంఎంలో చూశారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూడడానికి సిద్ధమవ్వండి. గుంటూరు కారం సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అని తెలిపింది.
కథ విషయానికి వస్తే..
సత్యం (జయరామ్), వసుంధర (రమ్యకృష్ణ)ల కొడుకు రమణ (మహేశ్‌బాబు). సత్యం ఓ హత్య కేసులో జైలుకి వెళ్తాడు. వసుంధర ఐదేళ్ల కొడుకు రమణని వదిలి రెండో పెళ్లి చేసుకుంటుంది. రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి (ఈశ్వరిరావు) దగ్గర పెరుగుతాడు. 25ఏళ్లు గడుస్తాయి. మహేశ్‌బాబు తల్లి వసుంధర రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అవుతుంది. వసుంధర తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాశ్‌రాజ్). వసుంధరకి పుట్టిన రెండో కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు. భవిష్యత్‌లో వసుంధర మొదటి కొడుకు రమణ అడ్డురావచ్చని భావించిన వెంకటస్వామి.. వసుంధరతో రమణ అన్నీ రకాలుగా తెగదెంపులు చేసుకునే విధంగా అగ్రిమెంట్ రెడీ చేస్తాడు. రమణతో సంతకం చేయించే బాధ్యత లాయర్ ఫణి( మురళీశర్మ)కి అప్పగిస్తాడు. ఇంతకీ రమణ ఆ అగ్రిమెంట్‌పై సైన్ చేస్తాడా? కొడుకుని వసుంధర ఎందుకు దూరం పెట్టింది? కథలో విలన్ ఎవరు ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.