తెలుగు రాష్ట్రాల్లో లైగర్ టికెట్ రేట్లు ఫిక్స్

లైగర్ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. ఏపీ,నైజాంలో ఈ సినిమాకు విధించిన గరిష్ఠ-కనిష్ఠ టికెట్ ధరలు ఇలా ఉన్నాయి..

Advertisement
Update:2022-08-21 12:17 IST

ప్రస్తుతం ఏ సినిమా థియేటర్లలోకి వస్తున్నా దానికి టికెట్ రేట్లు ఎలా పెట్టారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈమధ్య నిర్మాతలు కొంతమంది పోటీపడి మరీ తమ సినిమాలకు అతి తక్కువ టికెట్ రేట్లు పెట్టుకున్నారు. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం కుదరడం లేదంటూ తెగ బాధపడ్డారు కూడా. అలా పక్కా కమర్షియల్ అనే సినిమా ఈమధ్య కాలంలో చాలా తక్కువ టికెట్ రేట్లతో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు లైగర్ వంతు వచ్చింది.

విజయ్ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లైగర్. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు. కాబట్టి టికెట్ రేట్లు పెంచుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ లైగర్ యూనిట్ మాత్రం ఆ సాహసం చేయలేదు. ప్రస్తుతం అనధికారికంగా కొనసాగుతున్న గరిష్ట-కనిష్ఠ టికెట్ ధరల్నే తమ సినిమాకు కూడా ఫిక్స్ చేసింది.

నైజాంలో లైగర్ సినిమాకు మల్టీప్లెక్సుల్లో 250 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 175 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాకు మల్టీప్లెక్సుల్లో 177 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 147 రూపాయలు ధరలు లాక్ చేశారు. అయితే ఇక్కడ కూడా ఓ చిన్న సమస్య ఉంది.

ఈమధ్య కొన్ని సినిమాలకు మల్టీప్లెక్సుల్లో 250 రూపాయలు టికెట్ రేటు పెడితే, అది కూడా ఎక్కువని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అలా 250 రూపాయల రేటుతో వచ్చిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి కూడా. ఆ తర్వాత ఆ రేట్లను తగ్గించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో.. లైగర్ సినిమాకు నైజాం మల్టీప్లెక్సుల్లో 250 రూపాయల టికెట్ ధర ఫిక్స్ చేయడం సబబేనా అనే చర్చ మొదలైంది.

Tags:    
Advertisement

Similar News