లైగర్ ట్రయిలర్ రివ్యూ
విజయ్ దేవరకొండ కొత్త సినిమా లైగర్. ఈ మూవీ ట్రయిలర్ రిలీజైంది. ఆ ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం.
విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైయింది. తెలుగు ట్రయిలర్ ను చిరంజీవి, ప్రభాస్ జాయింట్ గా విడుదల చేయగా, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు. హైదరాబాద్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్ గా జరిగింది.
''ఒక లయిన్ కి టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ'' అనే రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం గూజ్ బంప్స్ మూమెంట్స్ తో ఆకట్టుకుంది. ఫస్ట్ గ్లింప్స్ లో లైగర్ ని మాత్రమే పరిచయం చేయగా ట్రైలర్ లో దాదాపు అన్ని పాత్రల్ని చూపించారు. ఒక చాయ్ వాలా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఎంఎంఎ టైటిల్‌ను గెలవడానికి చేసిన ప్రయాణాన్ని ట్రైలర్ లో పవర్ ప్యాక్డ్ గా చూపించారు. ఫైటింగ్ రింగ్ లో విజయ్ చేసిన పోరాటాలు ఎక్స్ ట్రార్డినరీగా ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ పాత్రకి నత్తి ఉండటం బిగ్ సర్ ప్రైజ్.
ట్రైలర్ లో లైగర్ లవ్ లైఫ్ ని కూడా అవిష్కరించారు. 'ఐ లవ్ యూ' అనే మాటని లైగర్ చెప్పిన విధానం బాగుంది. ట్రైలర్ లో లెజెండ్ మైక్ టైసన్ స్టైలిష్ ఇంట్రో అదిరింది. ''ఐయామ్ ఏ ఫైటర్'' అని విజయ్ అంటే.. దానికి బదులుగా ''నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి ?'' అనే అర్ధం వచ్చేలా మైక్ టైసన్ వెటకారంగా చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి మంచి ఫినిషింగ్ ఇచ్చింది.
విజయ్ దేవరకొండ తొలిసారిగా సిక్స్ ప్యాక్ లో యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించాడు. తన క్యారెక్టర్‌కి ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇచ్చాడు. సాలిడ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. తల్లి పాత్రలో రమ్య కృష్ణ తన నటనతో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అనన్య పాండే ఒక ట్రెండీ రోల్ ప్లేయ్ చేస్తుండగా, రోనిత్ రాయ్ కోచ్‌గా కనిపించారు. టెక్నికల్‌గా ట్రైలర్ సాలిడ్‌గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.
పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.