Krithi Shetty | అందరికీ థ్యాంక్స్ చెప్పిన హీరోయిన్

Krithi Shetty - వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైంది కృతి శెట్టి. ఎట్టకేలకు ఆమె ఓ సక్సెస్ అందుకున్నట్టు కనిపిస్తోంది.

Advertisement
Update: 2024-06-09 16:36 GMT

మనమే సినిమా ఎవరికి ఇంపార్టెంట్? అందరికీ ముఖ్యమే కానీ హీరోయిన్ కృతి శెట్టి కి మాత్రం ఈ సినిమా సక్సెస్ అత్యవసరం. ఆమె కెరీర్ బండి మరికొన్నాళ్లు నడవాలంటే ఈ సినిమా కచ్చితంగా హిట్టవ్వాలి. అంతలా ఎదురుచూస్తున్న ఆ సక్సెస్, కృతి శెట్టిని వరించిందా?

ఇప్పటికిప్పుడు మనమే సినిమాను హిట్టని చెప్పలేం. ప్రస్తుతానికైతే పాజిటివ్ టాక్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. 24 గంటల్లో ఏకంగా 55వేల టికెట్లు బుక్ అయ్యాయంటే సినిమా బాగానే కనెక్ట్ అయిందని అనుకోవాలి.

మొదటి రోజు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీస్ పై అనుమానాలున్నప్పటికీ అక్కడ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. రెండో రోజైన శనివారం, ఈరోజు కూడా ఆక్యుపెన్సీ బాగుంది. సో.. ఈ సినిమాకు ఫుట్ ఫాల్ మరింత పెరిగే అవకాశం ఉంది.

అందుకే కృతి శెట్టి ఒక అడుగు ముందుకేసింది. తన సినిమాపై ప్రేమ కురిపిస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్పింది. పరోక్షంగా సినిమా హిట్టయిందని అంటోంది. "మనమే సినిమాకు సంబంధించి నాకొచ్చిన ప్రశంసలు, కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ లవ్లీ ఎనర్జీతో మరింత కష్టపడతాను." అంటూ పోస్ట్ పెట్టింది.

సినిమాలో కృతి శెట్టి లుక్స్ కు, ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. బ్రేక్-ఈవెన్ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా కచ్చితంగా కృతి శెట్టి కెరీర్ కి హెల్ప్ అవుతుంది. ఆమె వరుస ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్ వేసింది.

Tags:    
Advertisement

Similar News