Krithi Shetty | మనమే సినిమాలో కృతి పాత్ర ఇదే

Krithi Shetty - శర్వానంద్ సరసన 'మనమే' సినిమా చేసింది కృతిశెట్టి. ఈ సినిమా గురించి గొప్పగా చెబుతోంది.

Advertisement
Update:2024-06-01 23:00 IST
Krithi Shetty | మనమే సినిమాలో కృతి పాత్ర ఇదే
  • whatsapp icon

శర్వానంద్ తాజా చిత్రం 'మనమే'. కెరీర్ లో శర్వాకు ఇది 35వ చిత్రం. సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించాడు.

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ ట్రయిలర్ ను కూడా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది కృతి శెట్టి. సినిమాలో తన పాత్ర తీరుతెన్నుల్ని బయటపెట్టింది.

"ఇందులో నా క్యారెక్టర్ పేరు సుభద్ర. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. నాకు చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకూ క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఈ క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీరామ్ ను, నా పాత్ర ఇంత స్ట్రిక్ట్ గా ఉంటుందా అని చాలా సార్లు అడిగాను. ఆయన అంతే స్ట్రిక్ట్ గా కావాలని చెప్పారు. ఆయన విజన్ ని ఫాలో అయ్యాను."

ఇకపై తెలుగులో గ్యాప్ ఇవ్వదంట కృతి శెట్టి. ఈ ఏడాది తెలుగులో 5 సినిమాలు చేస్తానని ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News