బౌన్సర్ల సంస్కృతిని తీసుకువచ్చిందే రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సీపీకి చిత్తశుద్ధి ఉంటే బౌన్సర్ల వ్యవస్థ మొత్తం రద్దు చేయాలి : ఎంపీ రఘునందన్ రావు
Advertisement
బౌన్సర్ల సంస్కృతిని తీసుకువచ్చిందే రేవంత్ రెడ్డి అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచనల వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఒక మీడియా చానల్ తో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ బౌన్సర్లను పెట్టుకొని తన దగ్గరికి వచ్చే వారిని పక్కకునూకిపిచ్చే కార్యక్రమం పెట్టుకున్నారని తెలిపారు. అల్లు అర్జున్ పంచాయితీలోకి బౌన్సర్లను ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు చిత్తశుద్ధి ఉంటే బౌన్సర్ల వ్యవస్థనే మొత్తంగా రద్దు చేయాలని, ఏ ఒక్కరూ బౌన్సర్ డ్రెస్ వేయకుండా చూడాలని సవాల్ విసిరారు.
Advertisement