Kismat | మరో జాతిరత్నాలు అవుతుందా?

Kismat Movie - కిస్మత్ మూవీ టీజర్ రిలీజైంది. హీరో శ్రీవిష్ణు రిలీజ్ చేశాడు. టీజర్ చూస్తుంటే, జాతిరత్నాలు గుర్తొస్తోంది.

Advertisement
Update:2023-10-16 08:10 IST

కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్‌’. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రియా సుమన్ హీరోయిన్. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఇటీవలే విడుదల చేశారు. తాజాగా శ్రీవిష్ణు చేతుల మీదుగా టీజర్‌ను లాంచ్ చేశారు.

బిగ్ ఫెయిల్యూర్ అయిన ముగ్గురు బడ్డీ దోస్తులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వ దేవ్ హోప్ కోల్పోయి ఉంటాడు, అభినవ్ గోమతం రచయితగా సినిమాల్లోకి ప్రవేశించాలని చూస్తుంటాడు, నరేష్ అగస్త్య రియా సుమన్‌తో ప్రేమలో ఉంటాడు. అనుకోని సంఘటనతో వారి కిస్మత్ ఎలా మారిపోయిందన్నది తెరపై చూడాలి.

దర్శకుడు శ్రీనాథ్ బాదినేని యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడు. ఇందులో థ్రిల్లింగ్ అంశాలతో పాటు కామెడీ పుష్కలంగా ఉంటుందంట. ముఖ్యంగా డైలాగులు యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద అసెట్ అని చెబుతున్నారు.

క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ తో 2 గంటల నిడివితో ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీని నవంబర్ లో విడుదల చేస్తారు.


Full View


Tags:    
Advertisement

Similar News