12న పెళ్లిపీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్
సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్
Advertisement
ప్రముఖ నటి కీర్తి సురేశ్ ఈనెల 12న పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. త్వరలోనే గోవాలో తన పెళ్లి ఉందని కొన్ని రోజుల క్రితమే తిరుమల శ్రీవారి సమక్షంలో కీర్తి సురేశ్ ప్రకటించారు. కీర్తి తన స్నేహితుడు ఆంటోనీతో వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. తమ కుమార్తె వివాహానికి వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు జి. సురేశ్ కుమార్ - మేనక సురేశ్ కుమార్, సోదరి రేవతి సురేశ్, నితిన్ నాయర్‌లు ఆహ్వానిస్తున్న వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement