Keerhy Suresh | పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ

Keerhy Suresh - తనపై వస్తున్న పెళ్లి పుకార్లపై కీర్తిసురేష్ స్పందించింది. ఇంతకీ ఆమె ఏమంటోంది?

Advertisement
Update:2023-09-17 22:58 IST

కీర్తిసురేష్ పెళ్లిపై పుకార్లు జనాలకు కొత్తేంకాదు. ఎప్పటికప్పుడు కీర్తి పెళ్లిపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొంతమంది పేర్లు కూడా తెరపైకొచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ రూమర్లను ఖండిస్తూ వస్తోంది కీర్తిసురేష్. తాజాగా ఈ హీరోయిన్ పై మరోసారి పెళ్లి పుకార్లు గుప్పుమన్నాయి.

స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్, హీరోయిన్ కీర్తిసురేష్ పెళ్లి చేసుకోబోతున్నారనేది ఆ పుకారు సారాంశం. అయితే ఇదేదో ఫ్రెష్ పుకారు కాదు. గతంలో వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. ఈ పుకారుపై కీర్తిసురేష్ స్పందించింది.

సైమా అవార్డు వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లింది కీర్తిసురేష్. అక్కడే తన పెళ్లిపై వచ్చిన పుకార్లను ఖండించింది. తను, అనిరుధ్ మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఇండియాలో అతడి తండ్రి సురేష్ కుమార్ కూడా చెప్పాడు. తన కూతురు పెళ్లిపై వస్తున్న పుకార్లలో నిజం లేదన్నాడు. ఎవరో కావాలనే తన కూతురు పెళ్లిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాడు.

కొన్ని రోజుల కిందట దుబాయ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను కీర్తిసురేష్ పెళ్లాడనుందంటూ ప్రచారం జరిగింది. ఆ టైమ్ లో ఆ వార్తను ఖండించిన కీర్తిసురేష్... తన లైఫ్ లో ఉన్న సీక్రెట్ వ్యక్తిని త్వరలోనే పరిచయం చేస్తానంటూ ప్రకటించింది. అయినప్పటికీ రూమర్లు ఆగడం లేదు. 

Tags:    
Advertisement

Similar News