Kavya Kalyanram | తెలుగు హీరోయిన్లకు కూడా అవకాశాలు
Kavya Kalyanram - తెలుగమ్మాయిలకు అంతగా అవకాశాలు రావనే విషయాన్ని కొట్టిపారేస్తోంది కావ్య కల్యాణ్ రామ్. తను తెలుగమ్మాయిని కాబట్టే వరుసగా అవకాశాలు వస్తున్నాయంటోంది.
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావనేది బహిరంగ రహస్యం. మరీ మఖ్యంగా స్టార్ హీరోల సరసన తెలుగమ్మాయిలకు అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. ఈ వాదనను తోసిపుచ్చుతోంది తెలుగమ్మాయి కావ్య కల్యాణ్ రామ్.
"తెలుగు హీరోయిన్స్‌కి అవకాశాలు రావటం లేదని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే, సావిత్రి, శ్రీదేవి ఇలా చాలా మంది తెలుగు హీరోయిన్స్ పెద్ద సక్సెస్‌ను సాధించారు. ఇండియా వైడ్ వాళ్ల కంటే సక్సెస్‌ను ఎవరూ చూడలేదు. నా విషయానికి వస్తే నేను తెలుగు అమ్మాయి కావటం నాకు ప్లస్సే అయ్యింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాను. ఆ మూడు సినిమాల డైరెక్టర్స్ తెలుగు మాట్లాడే హీరోయిన్‌నే తీసుకోవాలనుకున్నారు. అలా నాకు అవకాశం వచ్చింది."
నటీనటులు ఒక భాషకే పరిమితం కాకూడదని అంటోంది కావ్య. భాషతో సంబంధం లేకుండా హీరోయిన్లు అవకాశాలు దక్కించుకుంటున్నారని, తను కూడా అలానే అవకాశాలు అందిపుచ్చుకుంటున్నానని చెబుతోంది. ఆమె నటించిన ఉస్తాద్ సినిమా భోళాశంకర్ తర్వాత థియేటర్లలోకి వస్తోంది
రజినీకాంత్ జైలర్ సినిమా, చిరంజీవిగారి భోళా శంకర్ సినిమాల తర్వాత వస్తున్న ఉస్తాద్ కూడా హిట్టవుతుందని అంచనా వేస్తోంది కావ్య కల్యాణ్ రామ్. ఆ ఇద్దరూ లెజెండ్స్ సినిమాలను చూసే ఆడియెన్స్‌లో సగం మంది అయినా ఉస్తాద్ సినిమా చూస్తే చాలంటోంది. ఈమధ్య స్లమ్ డాగ్ హజ్బెండ్ అనే సినిమా కూడా ఇదే కాన్సెప్ట్ తో వచ్చింది. అట్టర్ ఫ్లాప్ అయింది.