Kavya KalyanRam - పుకార్లు ఖండించిన కావ్య కల్యాణ్ రామ్

Kavya KalyanRam - తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్ ను కావ్య కల్యాణ్ రామ్ ఖండించింది. తను ఆ ప్రకటనలు చేయలేదని స్పష్టం చేసింది.

Advertisement
Update:2023-07-13 09:56 IST

హీరోయిన్లపై పుకార్లు సర్వసాధారణం. ప్రతి హీరోయిన్ పై ఏదో ఒక టైమ్ లో రూమర్స్ వస్తూనే ఉంటాయి. అయితే తొలిసారి అలాంటివి ఫేస్ చేసినోళ్లు కొంచెం ఇబ్బంది పడతారు. ప్రస్తుతం హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ ఆ స్టేజ్ లోనే ఉంది.

ఇంతవరకు ఆమెకు రూమర్లు అంటే తెలియవు. ఆమెపై ఎలాంటి పుకార్లు రాలేదు. ఫస్ట్ టైమ్ వచ్చాయి. దీంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాటిపై క్లారిటీ ఇచ్చుకుంటూ బిజీగా ఉంది.

ఇంతకీ కావ్య కల్యాణ్ రామ్ పై వచ్చిన పుకారు ఏంటో తెలుసా? ఆడిషన్స్ టైమ్ లో ఆమె బాడీషేమింగ్ ఎదుర్కొందట. కావ్య కల్యాణరామ్ శరీరాకృతిపై కొంతమంది తెలుగు దర్శకులు కామెంట్ చేశారట. హీరోయిన్లు స్లిమ్ గా ఉండాలని, ఇలా బొద్దుగా ఉంటే అవకాశాలు రావని వెక్కిరించారట.

కావ్య బాడీషేమింగ్ ఎదుర్కొన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. వీటిపై కావ్య క్లారిటీ ఇచ్చింది. తను అలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వలేదని, బాడీషేమింగ్ కామెంట్స్ ఎదుర్కొనలేదని ఆమె స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News