Kangana Ranaut | డెబ్యూతోనే గెలుపు సాధించిన కంగన

Kangana Ranaut's victory as MP - బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, లోక్ సభలో అడుగుపెట్టబోతోంది. ఆమె ఎంపీగా గెలిచింది.

Advertisement
Update:2024-06-04 23:06 IST

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గెలిచింది. హిమాచల్ ప్రదేశ్ మండి నుండి బిజెపి అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఈ హీరోయిన్, 70వేల ఓట్లకు పైగా మెజారిటీతో, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన విక్రమాదిత్య సింగ్ ను ఓడించారు.

గెలిచిన వెంటనే ఆమె తన మార్క్ పంచ్ లు వేశారు. విక్రమాదిత్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బ్యాగులు సర్దుకొని బయల్దేరండి అంటూ విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కంగనా రనౌత్ తన బ్యాగులు సర్దుకొని తిరిగి ముంబయి వెళ్లిపోతుందని గతంలో విక్రమాదిత్య కామెంట్ చేశారు. దానికి కౌంటర్ గా కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది.

అంతకంటే ముందు మరో కాంగ్రెస్ మహిళా నేత, కంగనా రనౌత్ పై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల నుంచి చాలా సింపతీ సంపాదించుకుంది కంగనా. ఒకవేళ తను రాజకీయాల్లో రాణిస్తే, బాలీవుడ్ కు పూర్తిగా దూరమవుతానని ఎన్నికల ప్రచారంలో భాగంగా కంగనా ప్రకటించింది. ఇప్పుడామె ఎంపీగా గెలిచింది. త్వరలోనే లోక్ సభలో అడుగుపెట్టబోతోంది.

ఈ నేపథ్యంలో ఆమె తన కెరీర్ ను కొనసాగిస్తుందా లేదా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆమె చేతిలో 2 సినిమాలున్నాయి. ఆ 2 సినిమాలు పూర్తిచేసి, కెరీర్ కు ఆమె ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ