Kalki | కల్కిలో కమల్ హాసన్ లుక్ లీక్?

Kalki Movie - కల్కి మూవీ నుంచి కమల్ హాసన్ లుక్ లీక్ అయిందా.. లేక అది నకిలీదా..?

Advertisement
Update:2024-05-12 23:09 IST

కల్కి సినిమాకు లీకులు కొత్త కాదు. ఓవైపు ఫ్రమ్ ది స్క్రాచ్ అంటూ మేకర్స్ మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తున్నప్పటికీ.. మరోవైపు ఈ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్, వీడియోలు ఎప్పటికప్పుడు లీక్ అవుతూనే ఉన్నాయి.

ఒక దశలో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, ఈ అంశంపై సీరియస్ అయ్యారు. లీకులపై పత్రికాముఖంగా లీగల్ నోటీసులు కూడా జారీచేశారు. అయినప్పటికీ ఈ లీకులు ఆగకపోవడం బాధాకరం. తాజాగా మరో ముఖ్యమైన లీక్ ఒకటి వచ్చింది.

ఈ సినిమాలో లెజెండ్ కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడి మేకోవర్, గెటప్ ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అత్యంత కీలకమైన ఈ గెటప్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ లుక్ లో కమల్ హాసన్ గుబురుగడ్డం, మీసంతో సీరియస్ గా కనిపిస్తున్నాడు.

ఈమధ్య కాలంలో కమల్ ఎప్పుడూ ఇలా కనిపించలేదు. దీంతో ఇది కల్కి సినిమా గెటప్ అయి ఉంటుందంటూ ప్రచారం మొదలైంది. ఇది నిజంగా కల్కి సినిమాకు సంబంధించి లుక్ అయితే మాత్రం టీమ్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఇది ఎడిట్ చేసిన ఫొటో అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News