Kalki Movie | అన్ని యుగాలకు క్లయిమాక్స్ కల్కి

Kalki Movie Climax - ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి. ఈ సినిమా క్లయిమాక్స్, అన్ని కథలకు ముగింపులా ఉంటుందంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

Advertisement
Update:2024-06-19 12:58 IST

ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ కల్కి. ఈ సైంటిఫిక్ ఫిక్షన్ డ్రామా పై ప్రత్యేకంగా మాట్లాడాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అన్ని యుగాలకు క్లయిమాక్స్ లాంటి కథతో కల్కి సినిమా తెరకెక్కిందంటూ మూవీపై మరిన్ని అంచనాల్ని పెంచాడు.

"ఈ కథ బేసిక్ గా అన్నిటికి క్లైమాక్స్. కలియుగంలో ఏం జరుగుతుంది. ఏం జరగొచ్చు .. ఇలాంటి వాటన్నిటికీ ఇది క్లైమాక్స్‌. కేవలం ఇండియన్ లోనే కాదు వరల్డ్ లో అందరూ ఈ కథకు రిలేట్ అవుతారు. కృష్ణవతారంతో మహాభారం ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి కలియుగంలోకి ఎంటరైనప్పుడు ఈ కథ ఎలా వెళుతుందనేది, పూర్తిగా ఊహాజనితం. దీన్ని కథగా రాయలనుకున్నా. మనం చదివిన పురాణాలు, ఎపిక్స్ అన్నిటికి ఒక క్లైమాక్స్ లా ఉంటుంది కల్కి. ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరోయుగంలో దుర్యోధనుడు... ఇలా అన్నిట్లో ఒక రూపం తీసుకొని కలియుగంలో ఒక అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే అతనితో పోరాటం ఎలా ఉంటుందనే ఐడియాతో రాసుకున్నదే కల్కి."

కల్కి కథ రాయడం ప్రారంభించి, ముగించేసరికి సరిగ్గా ఐదేళ్లు పట్టిందంటున్నాడు నాగ్ అశ్విన్. ఎట్టకేలకు తన కథకు దృశ్యరూపం ఇచ్చానని, జూన్ 27న ఆ దృశ్యకావ్యాన్ని అంతా చూస్తారని చెబుతున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి నటీనటులు నటించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించారు. 

Tags:    
Advertisement

Similar News