పరువు తక్కువ.. పోస్టర్ల ఖర్చు కూడా రాలేదు

కళాపురం సినిమా థియేటర్లలోకి వచ్చింది. పెద్ద ఫ్లాప్ అయింది. పోస్టర్ల ఖర్చు కూడా రాలేదనేది ట్రేడ్ టాక్.

Advertisement
Update:2022-08-28 15:12 IST

ఓవైపు కార్తికేయ-2, మరోవైపు సీతారామం సినిమాలు జోరుగా నడుస్తున్నాయి. ఎవరైనా థియేటర్లకు వెళ్లాలనుకుంటే ఈ 2 సినిమాల కోసమే వెళ్తున్నారు. వీటికితోడు తాజాగా లైగర్ వచ్చింది. భారీ బజ్ కారణంగా ఈ సినిమా కూడా చూస్తున్నారు ఆడియన్స్. ఇలాంటి గట్టి పోటీ మధ్య వచ్చింది కళాపురం సినిమా. తమ సినిమా జాతిరత్నాలు టైపులో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాను థియేటర్లలోకి దించారు.

తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత దీని అసలు రంగు బయటపడింది. సినిమా మొత్తం వెదికినా కనీసం ఒక్కటంటే ఒక్క కామెడీ సీన్ కూడా లేదు. పైగా ప్రొడక్షన్ వాల్యూస్ దారుణం. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిం చూసినట్టుంది సినిమా అంతా. అలా మొదటి రోజు మొదటి ఆటకే వాష్-అవుట్ అయింది కళాపురం సినిమా.

పలాస, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాలు తీసిన కరుణ కరుణ్, కళాపురం సినిమాను డైరక్ట్ చేసి చేజేతులా తన కెరీర్ ను తానే నాశనం చేసుకున్నాడు. అటు జీ స్టుడియోస్ సంస్థ కూడా నాసిరకం సినిమా తీసి విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రెవెన్యూ సంగతి చూద్దాం.

కళాపురం సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 30 లక్షల రూపాయలొచ్చాయి. ఇక రెండో రోజైన శనివారం ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ కలిపి 15 లక్షల రూపాయలొచ్చినట్టు తెలుస్తోంది. అంటే, పోస్టర్ల ఖర్చు కూడా రాలేదన్నమాట. ఈ సినిమాకు భారీగా ప్రచారం ఏం చేయలేదు. ఆ మాటకొస్తే, ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను కూడా ఛీప్ గా, సింపుల్ గా జరిపించేశారు. అలా విడుదలైన రెండో రోజుకే కళాపూరం కాస్తా, కళావిహీనపురంగా మారిపోయింది.

Tags:    
Advertisement

Similar News