kajal | పోలీస్ గెటప్ కొత్త కాదంటున్న కాజల్

Kajal police getups - సత్యభామలో పోలీస్ గా నటించింది కాజల్. అయితే ఇలా యూనిఫామ్ లో కనిపించడం కాజల్ కు ఇదే తొలిసారి కాదు.

Advertisement
Update:2024-06-05 22:46 IST

కాజల్ నుంచి వస్తున్న సినిమా సత్యభామ. ఈ సినిమాలో ఆమె పోలీస్ గా కనిపించబోతోంది. ఇదే ఆమె తొలి పోలీస్ గెటప్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది తన తొలి ఖాకీ గెటప్ కాదంటోంది కాజల్.

"గతంలో జిల్లా అనే సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించా. అయితే అది సీరియస్ నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో పర్ ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా."

ఇలా అసలు విషయాన్ని బయటపెట్టింది కాజల్. సత్యభామ సినిమాలో తొలిసారి రియల్ స్టంట్స్ చేశానని, దీని కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించింది.

"సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. నేను రామ్ చరణ్ లా వంద మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్ కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రాఫ్ చేశారు."

ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది సత్యభామ సినిమా. ఈ మూవీ కోసం కాజల్ గట్టిగా ప్రచారం చేస్తోంది. 

Tags:    
Advertisement

Similar News