5 న పేలవంగా మరో రైట్ వింగ్ ప్రచార సినిమా!

రైట్ వింగ్ విజయం సాధించి వుంటే లోక్ సభ ఎన్నికల మాటేమో గానీ, ఒక ప్రచార సినిమాకి మాత్రం ఆధారిటీ వచ్చేసేది- మేము చెప్పిందే రైట్ అని! కానీ ‘జహంగీర్ నేషనల్ యూనివర్శిటీ (జెఎన్‌యూ)’ పేరుతో ప్రచార సినిమాకా అవకాశం దక్కలేదు. ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదలవుతోంది.

Advertisement
Update:2024-04-02 17:16 IST

2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఎన్నికల రణరంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో వున్న కాలంలో - మునుపెన్నడూ లేని పరిణామాలతో- అరెస్టులతో, బ్యాంకు ఖాతాల స్తంభనలతో, ఈవీఎంల కేసులతో –రోజురోజుకీ వేడెక్కుతోంది. ఈ వేడిలో ఒక ముఖ్య పరిణామం ఢిల్లీలో జెఎన్ యూ ఎన్నికలు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు మార్చి 24 న జరిగాయి. ఈ ఎన్నికల్లో లెఫ్ట్ వింగ్ పార్టీ మొత్తం నాలుగు పదవులనూ గెలిచి రైట్ వింగ్ పార్టీని ఓడించింది. జైశ్రీరామ్ పై లాల్ సలాం పైచేయి అయింది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న మధ్యాహ్నం వరకూ రైట్ వింగ్ విజయం వైపు దూసుకు పోతూంటే, గోదీ టీవీ ఛానెల్స్ ఈ విజయం లోక్ సభ ఎన్నికల విజయమేనని గొంతు చించుకో సాగాయి. మధ్యాహ్నం తర్వాత చూస్తే సైలెంట్ అయిపోయాయి. రిజల్ట్ న్యూసే లేదు. రిజల్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవసాగింది. విజయం వైపు లెఫ్ట్ ఫింగ్, రాత్రికల్లా ఘన విజయంతో లెఫ్ట్ వింగ్!

రైట్ వింగ్ విజయం సాధించి వుంటే లోక్ సభ ఎన్నికల మాటేమో గానీ, ఒక ప్రచార సినిమాకి మాత్రం ఆధారిటీ వచ్చేసేది- మేము చెప్పిందే రైట్ అని! కానీ ‘జహంగీర్ నేషనల్ యూనివర్శిటీ (జెఎన్‌యూ)’ పేరుతో ప్రచార సినిమాకా అవకాశం దక్కలేదు. ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదలవుతోంది. జెఎన్‌యూలో లెఫ్ట్ వింగ్ ని దుయ్యబడుతూ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ లో, ఇటీవల ‘బస్తర్- ది నక్సల్ స్టోరీ ’లో సీన్లు పెట్టారు. ఇప్పుడు ఏకంగా సినిమా తీశారు. ఇందులో సిద్ధార్థ్ బోడ్కే, ఊర్వశీ రౌటేలా, రవి కిషన్, పీయూష్ మిశ్రా, విజయ్ రాజ్, రష్మీ దేశాయ్ నటించారు. అంతగా తెలియని నిర్మాణ సంస్థ మహాకాల్ మూవీస్ నిర్మాతలు ఈ సినిమాని ఓ ‘ది కేరళ స్టోరీ’ లాగా, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ లాగా విక్రయించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉత్తరాదిన ఇలాటి సినిమాలకిక కాలం చెల్లింది. ఈ సినిమా ఎన్నికలకి ముందు ప్రేక్షకుల్ని ప్రభావితం చేసే బ్రెయిన్‌ వాషింగ్ కంటెంట్‌ గా ఖచ్చితంగా అర్హత పొందుతుంది. అయితే బ్రెయిన్ వాషింగ్ చేయించుకునే ఉత్సాహంగానీ, ఉబలాటం గానీ ఇప్పుడు ఉత్తరాదిన ఎంత మాత్రాన లేదు. తెలుగులో తీసిన ‘రజాకార్’ హిందీ వెర్షన్ ఉత్తరాదిలో ఎటుపోయిందో తెలీదు. తెలుగులో ఎంత మత భావాలు రెచ్చగొట్టినా ప్రేక్షకులు దాని తాలూకు బ్రెయిన్ వాషింగ్ చేయించుకోలేదు గానీ, తెలంగాణ చరిత్ర తెలుసుకున్నామని సంబరపడ్డారు, రైట్ వింగ్ కనిపెట్టిన చరిత్ర!

‘జహంగీర్ నేషనల్ యూనివర్శిటీ’ ని వినయ్ శర్మ రాసి దర్శకత్వం వహించాడు.

ఇస్లామోఫోబియాతో బ్రెయిన్ వాష్ చేయడానికి ఇలా పేరు పెట్టి సినిమా తీయడాన్ని లెఫ్ట్ వింగ్ విద్యార్ధులు తీవ్రంగా తప్పు బడుతూ, రైట్ వింగ్ విద్యార్థులకి చాలెంజీ విసిరారు. యూనివర్సిటీని ఇలా డెమనైజ్ చేస్తున్న ఈ సినిమాని మీరు ఖండించగలరా అని.

సినిమా పోస్టర్ వివాదాస్పదమైంది. కాషాయ రంగులో వున్న భారతదేశపు మ్యాప్‌ని ఎర్రటి రక్తంతో తడిసిన చేతి వేళ్ళు ఒడిసి పట్టుకుని వుంటాయి. ఇంకో పోస్టరుపై ‘మూసిన విద్యా గోడల వెనుక దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జరుగుతోంది’ అని క్యాప్షన్ వుంది.

ఇక కథ ఏమై వుంటుందో వూహకందేదే. యూనివర్సిటీలో టుక్డే టుక్డే గ్యాంగ్ కథే వుంటుంది. ఈ గ్యాంగ్ ని రైట్ వింగ్ విద్యార్ధులు తుక్కుతుక్కు కింద కొట్టడం వుంటుంది. విడుదల చేసిన ట్రైలర్ పూర్తి విషయాన్ని అవగతం చేస్తుంది.

ఇది తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్నట్టు ఇంతవరకు సమాచారం లేదు.

Full View


Tags:    
Advertisement

Similar News