Jagapathi Babu - రామబాణం ఒప్పుకోవడానికి కారణం అదే

Jagapathi Babu - రామబాణం సినిమా చేయడానికి గల ప్రత్యేక కారణాల్ని వెల్లడించాడు సీనియర్ నటుడు జగపతిబాబు.;

Advertisement
Update:2023-05-03 22:54 IST
Jagapathi Babu - రామబాణం ఒప్పుకోవడానికి కారణం అదే
  • whatsapp icon

'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ కు ఓ మోస్తరు స్పందన వస్తోంది. మే 5న రామబాణం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు, మీడియాతో మాట్లాడాడు. రామబాణం కథ ఒప్పుకోవడానికి కారణాన్ని బయటపెట్టాడు.

"ఇప్పుడన్నీ హారర్, యాక్షన్ , థ్రిల్లర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలమైంది. అలాగే గోపీచంద్, శ్రీవాస్, నేను కలిసి లక్ష్యం చేశాం. ఇది మెయిన్ ఎట్రాక్షన్. అలాగే రామబాణం లో అన్నదమ్ముల కాన్సెప్ట్ అద్భుతంగా కుదిరింది. గతంలో చేసిన శివరామరాజు కూడా కూడా అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూసి విడిపోయిన కొన్ని కుటుంబాలు కలిశాయి. రామబాణం కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా. సింగిల్ సెన్సార్ కట్ కూడా లేకుండా హాయిగా ఓ మంచి సినిమా చూసామనే అనుభూతిని కలిగిస్తుంది రామబాణం."

ఇలా రామబాణం అంగీకరించడం వెనక కారణాన్ని బయటపెట్టాడు జగపతిబాబు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత దాదాపు 70 సినిమాలు చేశాడట ఈ సీనియర్ నటుడు. వాటిలో కేవలం 6-7 సినిమాలు మాత్రమే తనకు తృప్తినిచ్చాయని, ఇప్పుడా సినిమాల లిస్ట్ లోకి రామబాణం కూడా చేరుతుందని చెబుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News