Shruti Haasan | శృతిహాసన్ దర్శకురాలిగా మారబోతోందా?

Shruti Haasan - శృతిహాసన్ డైరక్టర్ గా మారబోతోందా? ఈ ప్రచారంపై ఆమె ఏమంటోంది?

Advertisement
Update:2023-11-05 19:16 IST

క్రేజీ హీరోయిన్, గాయని శృతి హాసన్‌కు మెగాఫోన్ పట్టే ఆలోచన లేదు. రజనీకాంత్ ను ఆయన కూతురు ఐశ్వర్య డైరక్ట్ చేస్తున్న నేపథ్యంలో.. కమల్ హాసన్ ను శృతిహాసన్ డైరక్ట్ చేస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది. దీనిపై శృతిహాసన్ స్పందించింది. తనకు మెగా ఫోన్ పట్టుకునే ఆలోచన లేదని, తన తండ్రిని డైరక్ట్ చేసే ఆలోచన అస్సలు లేదని స్పష్టం చేసింది.

"ఓ మై గాడ్, మా నాన్న, నటుడు కమల్ హాసన్‌ ను డైరక్ట్ చేయాలనే ఆలోచనను నేను ఊహించలేను" అంటూ స్పందించింది శృతిహాసన్. కమల్ హాసన్, శృతిహాసన్ కలిసి ఇప్పటికే నటించారు. మరోవైపు వీళ్లిద్దరూ కలిసి స్టార్ట్ చేసిన శభాష్ నాయుడు అనే సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో.. కమల్ ను డైరక్ట్ చేసే ఉద్దేశం ఉందా అనే ప్రశ్నకు శృతిహాసన్ పై విధంగా స్పందించింది. తన తండ్రిని డైరక్ట్ చేసేంత స్థాయి తనకు లేదని ఓపెన్ గా చెప్పేసింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది శృతిహాసన్. "క్రాక్", 'వీరసింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య'తో టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్‌లను సాధించింది. త్వరలోనే ఆమె నటించిన సలార్ సినిమా విడుదల కాబోతోంది. ఇలా ఓవైపు హీరోయిన్ గా కొనసాగుతూనే, మరోవైపు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తానని, దర్శకత్వం వహించే ప్లాన్స్ మాత్రం లేవని స్ఫష్టం చేసింది శృతిహాసన్.

Tags:    
Advertisement

Similar News