Dil Raju | చిరంజీవి ప్రాజెక్టు నుంచి దిల్ రాజు తప్పుకున్నారా?

Dil Raju - భారీ చిత్రాలకు పెట్టింది పేరు దిల్ రాజు. ఇలాంటి ప్రొడ్యూసర్, చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్నారట. కారణం ఏంటి?

Advertisement
Update:2023-12-06 20:07 IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారని, ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిదని చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రెమ్యునరేషన్ సమస్యల కారణంగా దిల్ రాజు చిరంజీవి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రానికి దిల్ రాజుతో కమిట్ అయ్యాడు. భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో మరోసారి వర్క్ చేయబోతున్నాడు. పైగా అనీల్ రావిపూడి దగ్గర చిరంజీవికి సూట్ అయ్యే కథ ఉంది. దీంతో చిరంజీవిని దిల్ రాజు కలిశారని, చర్చలు చివరి దశకు వెళ్లాయని సమాచారం. అయినప్పటికీ, చిరంజీవి 70 కోట్ల పెద్ద రెమ్యునరేషన్‌ని కోట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇది రిస్కీ ప్రాజెక్టు అవుతుందని దిల్ రాజు భావిస్తున్నాడట.

భారీ బడ్జెట్ సినిమాలతో రిస్క్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు దిల్ రాజు. ఎందుకంటే, అతడి చేతిలో ఆల్రెడీ గేమ్ ఛేంజర్ లాంటి భారీ సినిమా ఉంది. కాబట్టి అతడు తన దృష్టిని చిరంజీవి నుండి రవితేజ వైపు మళ్లించినట్లు సమాచారం.

అనిల్ రావిపూడి, దిల్ రాజు, రవితేజ ఇప్పటికే రాజా ది గ్రేట్‌ చేశారు. ఇప్పుడీ కాంబో రిపీట్ కాబోతోంది. ఇటీవల, రవితేజ, గోపీచంద్ మలినేని కాంబో కూడా ఎనౌన్స్ చేశారు. అయితే ఆ సినిమా కూడా బడ్జెట్ కారణంగా రద్దయింది. దీంతో రవితేజ-దిల్ రాజు కాంబో సెట్ అయ్యేలా ఉంది.

Tags:    
Advertisement

Similar News