గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ హోదా కోసం ప్రోత్సాహకాల ప్రకటన!

‘ఇండియాలో పర్వతాల నుంచి బీచ్‌ల వరకు, నగర జీవితం నుంచి గ్రామీణ ప్రాంతాల జీవితం వరకు అన్ని రకాల లొకేషన్స్ వున్నాయి. ఆధునిక ప్రదేశాల నుంచి పాత స్మారక చిహ్నాల వరకూ అన్నీ వున్నాయి’ అని నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్ డీ సీ) మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్ చెప్పారు.

Advertisement
Update:2024-05-18 16:31 IST

ఇండియాలో పర్వతాల నుంచి బీచ్‌ల వరకు, నగర జీవితం నుంచి గ్రామీణ ప్రాంతాల జీవితం వరకు అన్ని రకాల లొకేషన్స్ వున్నాయి. ఆధునిక ప్రదేశాల నుంచి పాత స్మారక చిహ్నాల వరకూ అన్నీ వున్నాయి’ అని నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్ డీ సీ) మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్ చెప్పారు. ‘సినిమా నిర్మాణానికి లొకేషన్స్ తో బాటు ప్రభుత్వ సహకారం కూడా అవసరం. ప్రతీ సంవత్సరం 3,000 కంటే ఎక్కువ చలన చిత్రాల్ని రూపొందిస్తున్న ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ కేంద్రాల్లో ఒకటి. సినిమా నిర్మాణం కోసం ఇక్కడ ఇప్పటికే అన్ని రకాల వనరులు అందుబాటులో వున్నాయి. అవి మానవ వనరులు కావచ్చు లేదా పరికరాలు కావచ్చు. అంతేగాక ఇండియాలో షూటింగ్ చేయడమంటే చాలా తక్కువ ఖర్చుతో కూఉడుకున్న పని’ అని వివరించారు.

కేన్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్లో భారతదేశానికి ఇది రికార్డు సంవత్సరం. మొత్తం ఎనిమిది సినిమాలు ఈ చలన చిత్రోత్సవాల్లో పోటీపడుతున్నాయి. వీటిలో ముఖ్యమైనది పాయల్ కపాడియా నిర్మించిన ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ అనే చలన చిత్రం. ఇదేగాక దేశం బలమైన కేన్స్ ఫిలిం మార్కెట్ ఉనికిని కలిగి వుంది. అయితే భారత పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ), కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (ఏంఐబీ) కలిసి గ్లోబల్ కంటెంట్ కో-ప్రొడ్యూసర్‌లని లక్ష్యంగా చేసుకుని అనేక రకాల ఈవెంట్‌లని నిర్వహించాయి. ఈ ఈవెంట్ లో భాగంగా ఎన్ఎఫ్ డీ సీ మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్ ఇండియాని గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ గా ప్రమోట్ చేస్తూ పై విధంగా చెప్పారు.

ఆయన ప్రకారం, 2023లో ఇండియా సినిమాల చిత్రీకరణలకు ప్రోత్సాహకాలని మెరుగుపరిచింది. ప్రభుత్వం క్వాలిఫైయింగ్ ప్రొడక్షన్ వ్యయంలో 40% వరకు తిరిగి చెల్లించింది. ఇది మునుపటి 30% కంటే ఎక్కువ. ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లో వున్న ఈ ప్రోత్సాహకాలకు ఏంఐబీతో బాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ షూటింగ్ అనుమతిని మంజూరు చేసిన అంతర్జాతీయ ప్రొడక్షన్‌లకి అర్హత వుంటుంది. ఇంకా వీఎఫ్ఎక్స్ కోసం, యానిమేషన్ కోసం కూడా ఇలాంటి ప్రోత్సాహకాలున్నాయి. నాణ్యత కలిగిన వీఎఫ్ఎక్స్, యానిమేషన్ టెక్నాలజీలు ఇండియాలో కంటే ప్రపంచంలో ఎక్కడైనా రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకుని వుంటున్నాయి.

ఇంతేగాక, అదనంగా దేశంలోని అనేక రాష్ట్రాలు సొంత ప్రోత్సాహకాలనందిస్తున్నాయి. రాష్ట్రాలు అందించే ప్రోత్సకాలతో లబ్దిదారులు టాప్ అప్ చేస్తే, అది 4 మిలియన్ డాలర్లకి చేరుకుంటుంది. ఇది ఇండియాని నిజంగా చాలా లాభదాయక డెస్టినేషన్ గా చేస్తుంది. ఏ నిర్మాత అయినా ఇక్కడికి వచ్చి సినిమాలు తీయడమంటే నిర్మాణ వ్యయంలో ఆదా చేసుకోవడమే.

2016 నుంచి ఇండియాలో దాదాపు 200 అంతర్జాతీయ సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. వాటిలో కెనడాకి చెందిన ‘వెయిటింగ్ ఫర్ ది స్టార్మ్స్’, మరియు నెట్‌ఫ్లిక్ కి చెందిన ‘లుకాస్ టూ హెమిస్పియర్స్’ సహా గత రెండేళ్ళలో 80 సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. ఇండియాలోని ఫిలిం ఫెసిలిటేషన్ ఆఫీస్ (ఎఫ్ ఎఫ్ ఓ) కి అత్యధిక దరఖాస్తులు అమెరికా నుంచి వచ్చాయి. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తర్వాతి స్థానాల్లో వు న్నాయి. రాబోయే 30 ప్రాజెక్టులకి ప్రోత్సాహకాల కోసం నిర్మాతలు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. వాటిలో 50% యానిమేటెడ్ ప్రాజెక్టులు. వీటిలో ఎనిమిది అమెరికా నుంచి, నాలుగు ఆస్ట్రేలియా నుంచి, ఇంకో నాలుగు ఫ్రాన్సు నుంచీ వున్నాయి. ఈ మొత్తం దరఖాస్తులు చేసుకున్న నిర్మాతల్లో ఇప్పటి వరకు ఏడుగురు పూర్తి రాయితీలని పొందారు. దరఖాస్తు చేసిన తేదీ నుంచి 90 రోజుల్లో చెక్కులు అందుకున్నారు.

ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పోటీ మార్కెట్. అనేక దేశాలు ఉదారంగా చిత్రీకరణ ప్రోత్సాహకాలని అందిస్తున్నాయి. ఆసియాలో చూస్తే, ఇటీవలి కాలంలో కొన్ని ప్రొడక్షన్‌లు ఇండియా నుంచి థాయ్‌లాండ్‌కి మారాయి. వాటిలో ఆపిల్ టీవీ ప్లస్ కి చెందిన ముంబాయి సెట్ ‘శాంతారామ్’, జస్టిన్ లిన్ ‘ది లాస్ట్ డేస్ ఆఫ్ జాన్ అలెన్ చౌ’ సెట్ వున్నాయి.

ఈ నేపథ్యంలో గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ హోదా పొందడం కోసం ఆకర్షణీయ ప్రోత్సహకాల సహాయంతో, రెడ్ టేపిజం సత్వర సహాయ సహకారాలతో, ఇండియా విదేశీ నిర్మాతల్ని ఆకర్షించడానికి ఇతోధికంగా ప్రయత్నిస్తోంది. దీనికి అంతర్జాతీయ నిర్మాతల నుంచి మంచి ప్రతిస్పందన కూడా లభిస్తోంది. ఇక్కడికి వచ్చి షూటింగులు జరుపుకున్న విదేశీ నేర్మాతలు సంతోషాన్ని పంచుకున్న వారే తప్ప అసంతృప్తితో వెళ్ళిన వారు లేరు. 

Tags:    
Advertisement

Similar News