Ileana | నాకు సరైన గుర్తింపు దక్కలేదు

Ileana - సౌత్ నుంచి తనకు సరైన గుర్తింపు దక్కలేదని చెబుతోంది ఇలియానా. ఎందుకో సడెన్ గా అవకాశాలు తగ్గిపోయాయని బాధపడుతోంది.

Advertisement
Update:2024-05-01 14:12 IST

ఇండస్ట్రీలో తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని అంటోంది ఇలియానా. దానికి కారణం కూడా తెలియదని చెబుతోంది. తను అందరికీ అందుబాటులోనే ఉన్నానని, కానీ తనను ఎవ్వరూ గుర్తించలేదని బాధపడింది.

"బర్ఫీ సినిమాలో నటించిన తర్వాత సౌత్ ఇండస్ట్రీ నుంచి నాకు సినిమా ఆఫర్లు రాలేదు. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన నిర్మాతలు-దర్శకులు నేను బాలీవుడ్ లో సెటిల్ అయ్యానని అనుకున్నారు. మంచి కథ దొరికితే ఎక్కడైనా నటించడానికి నేను అప్పుడు సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు అవకాశాలు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకురాలేదు."

ఇలా తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె బయటపెట్టింది. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఇలియానా మళ్లీ కనిపించలేదు. కొన్ని ఆఫర్లు ఆమె తిరస్కరిస్తే, మరికొన్నింటిని మేకర్స్ ఆమెకు దూరం చేశారు. అలా తెలుగు-తమిళ ఇండస్ట్రీలకు ఆమె దూరమైంది.

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఇలియానా. పోకిరి సినిమా తర్వాత ఆమె రేంజ్ పెరిగింది. అప్పట్లోనే సినిమాకు కోటి రూపాయలు తీసుకునే హీరోయిన్ గా ఆమె రికార్డ్ సృష్టించింది.

Tags:    
Advertisement

Similar News