నన్ను చంపాలనుకుంటే చంపేయండి : నటి మాధవీలత
మహిళల మాన, ప్రాణ సంరక్షణ విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గను. ఒంటరిగానైనా పోరాటం చేస్తానని సినీ నటి మాధవీలత అన్నారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత కౌంటర్ ఇచ్చారు. నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు.. కానీ మహిళల మాన, ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను తెర మీద కనిపించే మహిళలు క్యారెక్టర్‌లెస్, గలీజ్ వాళ్లు అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు.. మరి తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి ఎవరూ సినిమా రంగంలోకి రాకండని మాధవీలత అన్నారు. సినిమాల్లో ఉన్నవాళ్లంతా ప్రాస్టిట్యూట్లని ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన జిల్లాను నుంచి ఎవరూ ఇండస్ట్రీకి రావొద్దు’ అని మాధవీలత అన్నారు.
ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ‘వయసైపోయిన పెద్ద మనిషి మాట్లాడిన భాషకు ధన్యవాదాలు. ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం. నన్ను చంపాలనుకుంటే వెంటనే చంపేయండి. జేసీ వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు, అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదని మంత్రి మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డి వయసుకు తగినట్లుగా మాట్లాడాలని ఆగ్రహించారు. ఎక్కడో బస్సు కాలిస్తే బీజేపీకి ఏం సంబంధం అని సత్య కుమార్ అన్నారు.