ఆయన మాటలకు ఆరు నెలలు అద్దంలో చూసుకోలేకపోయా

తన కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న సవాళ్లు, రిజెక్షన్స్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించిన విద్యాబాలన్‌

Advertisement
Update:2024-10-27 15:14 IST

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ తన కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న సవాళ్లు, రిజెక్షన్స్‌ గురించి పంచుకున్నారు. దక్షిణాదికి చెందిన ఒక నిర్మాత తనను అవమానించారని అన్నారు. ఆయన మాటలకు సుమారు ఆరు నెలలు అద్దంలో చూసుకోలేకపోయానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

'చక్రం' అనే మలయాళ మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చాను. మోహన్‌లాల్‌ హీరో. కెరీర్‌ ప్రారంభంలోనే స్టార్‌ హీరోతో సినిమా చేస్తున్నానని తెలిసి చాలా అవకాశాలు నన్ను వరించాయి. అనివార్య కారణాలతో షూటింగ్‌ దశలోనే ఆ మూవీ ఆగిపోయింది. దీంతో మిగిలిన సినిమాల్లో నన్నుతప్పించి వేరే హీరోయిన్స్‌ను పెట్టుకున్నారు. మూడేళ్ల పాటు బాధపడ్డాను. ఏం జరుగుతున్నదో అర్థం కాక కుంగుబాటుకు లోనయ్యాను. ఇంట్లో ప్రతిరోజూ గొడవలు జరుగుతుండేవి. నీ తోటి వాళ్లంతా సెటిలయ్యారు. నువ్వు ఎందుకు ఇక్కడే ఆగిపోయావు. సినిమాలు మనకు సెట్‌ కావని అమ్మ చెబుతుండేది.

కొంతకాలానికి ఒక తమిళ మూవీలో ఆఫర్‌ వచ్చింది. కొన్నిరోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. 'చక్రం' ఆగిపోయిందని తమిళ నిర్మాతకు తెలిసింది. దాంతో ఆయన నా జాతకం చూపెట్టారు. తమ సినిమాకు సెట్‌ కానని తొలిగించారు. విషయం తెలిసి నా తల్లిదండ్రులతో ఆయనను కలిశాను. సినిమా కోసం షూట్‌ చేసిన కొన్ని సన్నివేశాలు చూపిస్తూ.. 'ఒక్కసారి ఆమె ముఖం చూడండి హీరోయిన్‌లా ఎక్కడైనా కనిపిస్తున్నదా? డ్యాన్స్‌ రాదు. యాక్టింగ్‌ రాదు' అని అవమానించారు. ఆ మాటలకు దాదాపు ఆరు నెలలు అద్దంలో చూసుకోలేకపోయాను. నాపై నాకే అసహ్యం వేసింది అని విద్యాబాలన్‌ తెలిపారు. ఆత్మవిశ్వాసం కోల్పోయిన సమయంలో ప్రదీప్‌ సర్కార్‌ తనకు ఎంతో అండగా నిలిచారని.. యాడ్‌ షూట్స్‌, సినిమాల్లో అవకాశం ఇచ్చారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News