హ్యాపీగా లేను జీవితంలో ప్రశాంతత లేదు.. రజనీ హాట్ కామెంట్స్

‘ప్రస్తుతం నేను సంతోషంగా లేను. నాకసలు ప్రశాంతతే లేదు. మునులు, యోగులు, సిద్ధులతో పోలిస్తే నేను 10శాతం ప్రశాంతతో కూడా లేను

Advertisement
Update:2022-07-24 20:58 IST

రజనీకాంత్.. తమిళ ప్రజల ఆరాధ్యనటుడు. ఆయన సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్, క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయనతో ఒక్కసారైనా సినిమా తీయాలని దర్శకులు, నిర్మాతలు ఎదురుచూస్తుంటారు. స్టార్ హీరోయిన్లు కూడా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని తహతహలాడుతుంటారు. ఇక రజనీకాంత్ కు ఆధ్యాత్మికవిషయాల మీద ఆసక్తి ఎక్కువన్న విషయం తెలిసిందే. ఆయన తరచుగా హిమాలయాలకు కూడా వెళ్తుంటారు.

అయితే రజనీకాంత్ తాజాగా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. తాజాగా చెన్నైలో 'హ్యాపీ సక్సెస్ ఫుల్ థ్రూ క్రియ యోగా' అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ కీలక వ్యాఖ్యలు చేశారు.

'ప్రస్తుతం నేను సంతోషంగా లేను. నాకసలు ప్రశాంతతే లేదు. మునులు, యోగులు, సిద్ధులతో పోలిస్తే నేను 10శాతం ప్రశాంతతో కూడా లేను. నేను నటించిన సినిమాల్లో రాఘవేంద్ర, బాబా మాత్రమే నాకు సంతృప్తిని ఇచ్చాయి. హిమాలయాలు చాలా గొప్ప ప్రదేశం. అక్కడ ఎన్నో అరుదైన వనమూలికలు దొరుకుతాయి. వాటిని తీసుకొని ఎన్నో రోజులపాటు సంతోషంగా ఉండొచ్చు.

నేను ఎంతో కీర్తిని సంపాదించాను. డబ్బును కూడా అర్జించాను. కుటుంబం, అభిమానించే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నాకు ఆనందం లేదు' అంటూ రజనీ వ్యాఖ్యానించారు. రజనీ ఇంత వైరాగ్యంతో మాట్లాడటంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    
Advertisement

Similar News