హంట్ టీజర్.. సుధీర్ బాబు ఫుల్ యాక్షన్

సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా హంట్. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు.

Advertisement
Update:2022-10-04 13:02 IST
హంట్ టీజర్.. సుధీర్ బాబు ఫుల్ యాక్షన్
  • whatsapp icon


Full View

అర్జున్‌లో ఇద్దరు ఉన్నారు. ఒకరు 'ఎ', మరొకరు 'బి' అనుకుంటే... అర్జున్ 'ఎ'కి తెలిసిన మనుషులు, జరిగిన ఘటనలు, వ్యక్తిగత జీవితం.. ఇలా ఏదీ అర్జున్ 'బి'కి తెలియదు. కానీ అర్జున్ 'ఎ'కి తెలిసిన భాషలు, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ అర్జున్'బి'లో కూడా ఉన్నాయి. అర్జున్ 'ఎ'గా ఉండటమే అర్జున్‌కు ఇష్టం! అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయిన కేసు ఏమిటి? చివరికి అర్జున్ ఆ కేసును ఎలా ఛేదించాడనేది 'హంట్' సినిమా. 


సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధానపాత్రలు పోషించారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందనే విషయం తాజాగా రిలీజైన టీజర్ చూస్తే అర్థమౌతోంది. 


'హంట్' టీజర్ లో ఫుల్ యాక్షన్ కట్ చూపించారు. సుధీర్ బాబు నటనకు తోడు అతడి సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు' అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ బాగుంది. 


సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ సైతం పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నచిత్రమిది. ఇంటర్నేషనల్ టెర్రరిజంను టచ్ చేస్తూ తెరకెక్కించిన పోలీస్ థ్రిల్లర్ ఇది.

Tags:    
Advertisement

Similar News