Dasara Movie - పాన్ ఇండియా మూవీగా ఎలా మారింది?
Dasara Movie - నాని హీరోగా నటించిన సినిమా దసరా. పాన్ ఇండియా లెవెల్లో రిలీజైంది. ఇంతకీ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు?
పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కింది దసరా మూవీ. ఇందులో పాత్రలన్నీ తెలంగాణ యాసలోనే మాట్లాడతాయి. మరి ఇలాంటి లోకల్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లాలని నానికి ఎందుకు అనిపించింది? ఈ ప్రశ్నకు నాని దగ్గర సాలిడ్ సమాధానం ఉంది.
"కథ విన్నప్పుడే పాన్ ఇండియా అనుకున్నాను. ప్రేమ, స్నేహం, పగ యూనివర్సల్ గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్. మన కల్చర్ ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మ తో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి కథ వచ్చినపుడు ఇది మా కల్చర్ అని చెప్పడం మన బాధ్యత. దీనిని అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. భూత్ కొళా అనేది కర్ణాటకలో ఉందని కాంతార సినిమాతో దేశంలో అందరికీ తెలిసింది. ఇలా మన కల్చర్ ని చెప్పే అవకాశం వచ్చినపుడు దానిని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. దసరాతో మేం అదే చేశాం."
ఇలా తన ప్లానింగ్ ను బయటపెట్టాడు నాని. ఇప్పుడు లోకల్ అనే పదం చిన్నదైపోయిందని, కొత్తగా ఉన్న ప్రతి కథ గ్లోబల్ సినిమాగా మారుతుందని అంటున్నాడు నాని. అయితే ఈ సినిమాకు ఉత్తరాది నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. దీనిపై కూడా నాని స్పందించాడు.
తను ఉత్తరాది ప్రేక్షకులకు కొత్త నటుడ్ని కాబట్టి, ఆటోమేటిగ్గా ఓపెనింగ్స్ తక్కువగానే ఉంటాయంటున్నాడు నాని. తను అమితాబ్ బచ్చన్ ను కాదనే విషయం తనకు తెలుసని, నార్త్ లో దసరా సినిమా నిలదొక్కుకోవడానికి కాస్త టైమ్ పడుతుందని చెబుతున్నాడు నేచురల్ స్టార్.