Vikram | మరో సినిమా పూర్తిచేసిన విక్రమ్

Hero Vikram - సర్జరీ నుంచి కోలుకున్న విక్రమ్, వెంటనే సెట్స్ పైకి వచ్చాడు. తంగలాన్ సినిమా పూర్తిచేశాడు.

Advertisement
Update:2023-07-05 09:56 IST
Vikram | మరో సినిమా పూర్తిచేసిన విక్రమ్
  • whatsapp icon

ప్రస్తుతం తంగలాన్ అనే సినిమా చేస్తున్నాడు విక్రమ్. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆ సర్జరీ నుంచి త్వరగానే కోలుకున్నాడు విక్రమ్.

అలా కోలుకున్న విక్రమ్, తాజాగా తంగలాన్ సినిమా షూట్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడా సినిమా షూటింగ్ ను కూడా పూర్తిచేశాడు. 118 రోజుల పాటు తంగలాన్ కోసం పనిచేసినట్టు వెల్లడించాడు విక్రమ్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లోనే అతడు తీవ్రంగా గాయపడ్డాడు

రంజిత్ దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది తంగలాన్ సినిమా. ఈ సినిమా మొత్తం షర్ట్ లేకుండా నటించాడు విక్రమ్. అంతేకాదు, పాత్ర కోసం పూర్తిగా బరువు తగ్గి మేకోవర్ అయ్యాడు. అలా బరువు తగ్గడం వల్లనే గాయాల పాలయ్యాడు.

స్టుడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News