'ప్రిన్స్' వెనక కష్టాన్ని బయటపెట్టిన హీరో
ప్రిన్స్ మూవీ తో నేరుగా తెలుగులోకి వస్తున్నాడు హీరో శివ కార్తికేయన్. ఈ సినిమా టైం లో ఎదురైన కష్టాలని బయట పెట్టాడు.
ప్రిన్స్ సినిమాతో నేరుగా టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు హీరో శివ కార్తికేయన్. తెలుగు-తమిళ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా దర్శకుడు అనుదీప్ టైమింగ్ ను పట్టుకోవడం తనకు చాలా కష్టమైందంటున్నాడు.
"ప్రిన్స్ ప్రాజెక్ట్ ఒక సవాల్ తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో రాశారు. తెలుగు స్క్రిప్ట్ ని తమిళ్ చేయడం ఒక సవాల్ గా తీసుకొని వర్క్ చేశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఇక షూటింగ్ విషయానికొస్తే అనుదీప్ టైమింగ్ పట్టుకోవడం కొంచెం కష్టమైంది. ప్రతి సీన్ ను ముందుగా అనుదీప్ నటించి చూపించేవాడు. దాన్ని నేను అనుసరించేవాడ్ని."
ఇలా తెలుగు-తమిళ భాషల్లో ప్రిన్స్ సినిమాకు తను పడిన కష్టాన్ని వెల్లడించాడు శివ కార్తికేయన్. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ మంచి పొజిషన్ లో ఉందంటున్నాడు. విజయ్, వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నారని... అలాగే రామ్ చరణ్ - శంకర్ కలసి పని చేస్తున్నారని... ఇలా రెండు పరిశ్రమలు కలసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం అంటున్నాడు.
ప్రిన్స్ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. జిన్నా, సర్దార్, ఓరిదేవుడా సినిమాల నుంచి శివకార్తికేయన్ కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. అటు తమిళనాట కూడా శివ కార్తికేయన్ కు సెగ తప్పేలా లేదు.