Nikhil | తండ్రి అయిన నిఖిల్

Hero Nikhil - హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. అతడి భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement
Update:2024-02-21 23:02 IST

హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి అయ్యాడు. అతడి భార్య డాక్టర్ పల్లవి వర్మ ఈరోజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తనకు కొడుకు పుట్టిన విషయాన్ని నిఖిల్ స్వయంగా మీడియాకు వెల్లడించాడు. కొడుకును తొలిసారి ముద్దాడిన ఫొటోను కూడా విడుదల చేశాడు.

నిఖిల్ అభిమానులు,స్నేహితులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2020లో నిఖిల్‌, పల్లవిల వివాహం జరిగింది. అంతకంటే ముందు మూడేళ్లు వీళ్లు ప్రేమించుకున్నారు. కరోనా టైమ్ లో గోవాకు తీసుకెళ్లి మరీ పల్లవికి ప్రపోజ్ చేశాడు నిఖిల్. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూడా కరోనా టైమ్ లోనే జరిగిపోయింది.

అప్పట్నుంచి టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో ఒకరిగా కొనసాగుతున్న ఈ జంట, ఇప్పుడు తల్లిదండ్రులుగా మారారు. త్వరలోనే కొడుకు పేరును ప్రకటించబోతున్నాడు నిఖిల్.

ప్రస్తుతం పాన్‌ఇండియా మూవీ ‘స్వయంభూ’ లో నిఖిల్‌ నటిస్తున్నాడు. దీంతో పాటు ‘ది ఇండియా హౌస్’, ‘కార్తికేయ 3’ చిత్రాలు కూడా చేతిలో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News