100 కోట్ల షేర్ దిశగా సంక్రాంతి విన్నర్ హనుమాన్!

HanuMan Box Office Collection: ఏ మాత్రం స్టార్ పవర్ లేని ఒక మీడియం బడ్జెట్ సినిమా ఎన్ని వొత్తిళ్ళు ఎదురైనా లొంగకుండా, హిందీ వెర్షన్ కారణంగా అనివార్యంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి బరిలోకి కి దిగి, సంక్రాంతి విన్నర్ కావడమేకాదు, తెలుగులో రూ. 100 కోట్ల షేర్ దిశగా దూసుకుపోవడం అందర్నీ ఆశ్చరపరుస్తోంది.

Advertisement
Update:2024-01-15 13:59 IST
100 కోట్ల షేర్ దిశగా సంక్రాంతి విన్నర్ హనుమాన్!
  • whatsapp icon

ఏ మాత్రం స్టార్ పవర్ లేని ఒక మీడియం బడ్జెట్ సినిమా ఎన్ని వొత్తిళ్ళు ఎదురైనా లొంగకుండా, హిందీ వెర్షన్ కారణంగా అనివార్యంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి బరిలోకి కి దిగి, సంక్రాంతి విన్నర్ కావడమేకాదు, తెలుగులో రూ. 100 కోట్ల షేర్ దిశగా దూసుకుపోవడం అందర్నీ ఆశ్చరపరుస్తోంది. ఈ పరుగు ముందు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ కూడా వెనుకబడి పోయింది. నార్త్ ఇండియాలో అయోధ్యా టెంపుల్ ప్రారంభోత్సవ సంరంభంలో పుట్టిన భక్తి వాతావరాణాన్ని క్యాష్ చేసుకోవాలన్న లక్ష్యంతో అనివార్యంగా సంక్రాంతి పోటీలోకి దిగిన ‘హనుమాన్’- ఇటు తెలుగులోనే కాకుండా హిందీలోనూ విజయదుందుభి మోగిస్తోంది!

నార్త్ నుంచి ప్రముఖ ‘అమర్ ఉజాలా’ హిందీ దినపత్రిక సమాచారం ప్రకారం, హిందీలో మొదటి రోజు కేవలం 2 కోట్లు వసూలు చేసి, రెండవ రోజు 3 కోట్ల 90 లక్షలకి పెరిగి, నిన్న మూడో రోజు ఆదివారం మరింత పెరిగి, 6 కోట్ల 10 లక్షలు వసూలు చేసింది. విడుదలకి ముందు ఒక ఈవెంట్ లో ప్రతీ టికెట్టు పై 5 రూపాయలు అయోధ్యా టెంపుల్ కి వెళ్తాయని నిర్మాత ప్రకటించడంతో సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోందని పత్రిక తెలిపింది. ఇదే వారం విడుదలైన విజయ్ సేతుపతి -కత్రీనా కైఫ్ లు నటించిన హిందీ ‘మెర్రీ క్రిస్మస్’, ధనుష్ నటించిన తమిళం ‘కెప్టెన్ మిల్లర్’ కూడా వెనుకబడిపోయాని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రాసింది.

జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్న ‘హనుమాన్’ మొదటి రోజు 24 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. నిన్న మూడో రోజుకల్లా 40 కోట్లు దాటేసింది. ఈ సినిమా సెట్ చేస్తున్న అద్భుతమైన ట్రెండ్‌ని చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. సినిమా అందరి అంచనాలకి మించి వసూళ్ళు సాధిస్తుండడంతో అన్ని షోలు హౌస్ ఫుల్స్ నమోదు చేస్తున్నాయి. రాబోయే 3-4 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే అద్భుతంగా వున్నాయి. పండుగ రోజుల తర్వాత కూడా ఇదే హోల్డ్ కొనసాగితే సినిమా ఫుల్ రన్‌లో 100 కోట్ల షేర్ వసూలు చేయడం ఖాయమని అంటున్నారు. కనీసం మూడు వారాలు ఈ హోల్డ్ ని కొనసాగిస్తే చాలునని అంటున్నారు.

పండుగ రోజుల్లో సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ని జోడించడాన్ని, పండుగ రోజుల రెస్పాన్స్ నీ చూస్తూంటే కనీసం 3 వారాల పాటు స్ట్రాంగ్ రన్‌ ని కలిగి వుండేలా కనిపిస్తోంది. ప్రముఖ బాక్సాఫీసు ట్రాకింగ్ వెబ్ సైట్ సాచ్నిక్ లో ఈ రోజు మార్నింగ్ షోకి నమోదైన ఆక్యుపెన్సీ చూస్తే...(శాతాల్లో) హైదారాబాద్- 90, బెంగుళూరు 42, చెన్నై-43, విజయనాద -89, వరంగల్-89, గుంటూరు- 88, వైజాగ్- 78, నిజామాబాద్- 91, ఢిల్లీ-6, ముంబాయి-10, కరీం నగర్ -94, మహేబూబ్ నగర్ 92, కాకినాడ 98.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ కి నిరంజన్ రెడ్డి నిర్మాత. రూ. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. దీని ఓటీటీ హక్కుల్ని జీ5 రూ.16 కోట్లకి సొంతం చేసుకుంది. 

Tags:    
Advertisement

Similar News