ఆస్కార్ కన్ఫామ్ అయ్యాక ఎన్టీఆర్ ఎవరికి ఫోన్ చేశారంటే..?

ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు జూనియర్ ఎన్టీఆర్. స్టేజ్‌పై కీరవాణి, చంద్రబోస్‌ నిల్చొని అవార్డును తీసుకున్న ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోను అని చెప్పారు.

Advertisement
Update:2023-03-15 08:55 IST

ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం వేర్వేరుగా భారత్ కి వస్తోంది. ముందుగా ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆస్కార్ అవార్డ్ అందుకున్న సందర్భాన్ని, ఆ క్షణాలను తాను జీవితంలో మరచిపోలేనని అన్నారు ఎన్టీఆర్.


ఆ విషయం ముందు నా భార్యకే చెప్పా..

ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ముందు ఆ విషయం తన భార్యకు ఫోన్ చేసి చెప్పానని, ఆమెతో తన సంతోషాన్ని పంచుకున్నానని అన్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడంతో భారత్ మొత్తం సంబరాలు జరిగాయి. ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాని హోరెత్తించారు.

ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు జూనియర్ ఎన్టీఆర్. స్టేజ్‌పై కీరవాణి, చంద్రబోస్‌ నిల్చొని అవార్డును తీసుకున్న ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోను అని చెప్పారు. నా సినిమా కెరీర్ లో అదే నా బెస్ట్‌ మూమెంట్‌ అని అన్నారు ఎన్టీఆర్.


మన దేశం లాగే ఆ అవార్డు కూడా ఎంతో గొప్పగా ఉందన్నారు. అదొక అద్భుతమైన అనుభవం అని, దాన్ని మాటల్లో వర్ణించలేను అని చెప్పారు. భారతీయుడినైనందుకు, అందులోనూ తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నానని చెప్పారు ఎన్టీఆర్. తమకు ఇలాంటి గౌరవం దక్కడానికి ప్రధాన కారణం అభిమానులు, సినీ ప్రియులు అని స్పష్టం చేశారు. వారి ప్రేమ, ఆశీస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైందన్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ వచ్చిన సందర్భంలో మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కి ఫుల్ సపోర్ట్ లభించింది. చరణ్ ని అభినందిస్తూ మెగా ఫ్యామిలీ సందేశాలు పంపింది. ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి పెద్దగా స్పందన లేదు అనే విమర్శ వినపడుతోంది.

బాలకృష్ణ ఫేస్ బుక్ లో తన సందేశం ఉంచారు కానీ, ఎక్కడా ఎన్టీఆర్ పేరు మెన్షన్ చేయలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ కూడా ఆస్కార్ వేదికపై నందమూరి ఫ్యామిలీ గురించి ఎక్కడా చెప్పుకోలేదు. రామ్ చరణ్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గొప్పదనాన్ని చెప్పారు. అప్పట్లో ఆయన ఆస్కార్ వేడుకను చూడటానికి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. తన సినిమాకి ఆస్కార్ రావడంతో తన తండ్రి చిరంజీవి ఎంతో సంతోషించాడని అన్నారు.

Tags:    
Advertisement

Similar News