అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబోలో నాలుగో మూవీ

జక్కన్న కూడా టచ్‌ చేయని జానర్‌లో ఉంటుందన్న నిర్మాత నాగవంశీ

Advertisement
Update:2024-10-25 08:27 IST

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన స్టైల్‌తో అంతర్జాతీయంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. పుష్ప మూవీతో అవార్డులు, రివార్డులు దక్కించుకున్నారు. మరికొన్ని రోజుల్లో 'పుష్ప2' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌-బన్నీల కాంబోలో మరో మూవీ తెరకెక్కనున్నది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తిరకమైన కామెంట్స్‌ చేసి అల్లు అర్జున్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమా స్క్రిప్ట్‌ పనులు తుది దశలో ఉన్నాయి. 'పుష్ప2' పూర్తయ్యాక దీని వివరాలు వెల్లడిస్తాం. జనవరిలో స్పెషల్‌ ప్రోమోతో సినిమాను ప్రకటిస్తాం. మార్చి నుంచి షూటింగ్‌ మొదలవుతుంది. ఆ నెలలోనే అల్లు అర్జున్‌ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన కూడా టచ్‌ చేయని జానర్‌లో ఈ మూవీ ఉంటుంది. మంచి విజువల్స్‌ ఉంటాయి. ఇప్పటిదాకా దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని రూపొందిస్తున్నామన్నారు.

అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి (2012), సన్నాఫ్‌ సత్యమూర్తి (2015), అల వైకుంఠపురములో(2020) మూడు సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న నాలుగో మూవీ ఇది. దీంతో బన్నీ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

Tags:    
Advertisement

Similar News