Bholaa Shankar - భోళాశంకర్ ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది

Bholaa Shankar Song - చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది.

Advertisement
Update:2023-06-04 20:47 IST

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న సినిమా 'భోళా శంకర్‌'. ఇవాళ్టి నుంచి ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈరోజు విడుదలైన మొదటి పాట భోళా మానియా మాస్ ని ఆకట్టుకునే బీట్‌ తో ఎనర్జిటిక్ గా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాసిన ఈ పాటను మహతి స్వర సాగర్ స్వరపరిచాడు. రేవంత్ ఆలపించాడు.

విడుదల చేసింది లిరికల్ వీడియోనే అయినప్పటికీ, అందులో మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ పెట్టారు. ఆ స్టెప్పులు చూడ్డానికి కన్నుల పండుగలా ఉన్నాయి. ఈ స్టెప్స్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సుస్మిత కొణిదెల స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఈ పాటలో చిరంజీవి స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపించారు.

అనిల్ సుంకర నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో తమన్న హీరోయిన్ గా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. హీరో సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.

ఇకపై భోళాశంకర్ నుంచి దశలవారీగా పాటలు రాబోతున్నాయి. ఇవాళ్టి సాంగ్ ను దేవిశ్రీ ప్రసాద్ లాంచ్ చేయడం విశేషం. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.


Full View


Tags:    
Advertisement

Similar News