తండ్రి వయస్సు హీరోలు..తనయ వయస్సు హీరోయిన్లు.. కమల్ హాసన్ పుత్రిక.. చిరు, బాలయ్యల కథానాయిక

సినిమాకి ఈ వయస్సులు, సెంటిమెంట్లు, వరసలు ఏంటీ అని కొట్టి పారేయొచ్చు. కానీ తన తండ్రితో సమానంగా దక్షిణాదిలో నటిస్తున్న హీరోల సరసన ఆయన కుమార్తె హీరోయిన్‌గా నటించడం ఇప్పుడు హాట్ టాపిక్.

Advertisement
Update:2022-12-11 20:21 IST

టాలీవుడ్ మాత్రమే కాదు భారతదేశ సినీ పరిశ్రమలో ఏ భాషాచిత్రాలు చూసినా ముసలి హీరో, పడుచు హీరోయిన్ తెరపై ప్రత్యక్షమవుతారు. హిందీ, మలయాళం కొంత నయం. వయస్సులకు తగ్గట్టు కథానాయికల్ని కొన్ని సినిమాలకైనా ఎంపిక చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకూ ఏఎన్ఆర్ నుంచి నాగచైతన్య వరకూ ముసలి హీరో, పడుచు హీరోయిన్ ఫార్ములా ఫాలో అవుతూ ఉన్నారు. సినిమాకి ఈ వయస్సులు, సెంటిమెంట్లు, వరసలు ఏంటీ అని కొట్టి పారేయొచ్చు. కానీ తన తండ్రితో సమానంగా దక్షిణాదిలో నటిస్తున్న హీరోల సరసన ఆయన కుమార్తె హీరోయిన్‌గా నటించడం ఇప్పుడు హాట్ టాపిక్.

కమల్ హాసన్ వయస్సు 68 సంవత్సరాలు కాగా ఆయన కూతురు శ్రుతిహాసన్ 36 ఏళ్ల వయస్సులో ఉంది. తన తండ్రి వయస్సున్న చిరంజీవి (67 సంవత్సరాలు)కి జోడీగా వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తోంది. చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ `ఎవడు` మూవీలోనూ శ్రుతిహాసన్ హీరోయిన్. చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్‌లో కథానాయిక కమల్ కూతురే. మెగాస్టార్ మేనల్లుడు అల్లు అర్జున్ రేసుగుర్రంలోనూ నటించిన శ్రుతి..ఇప్పుడు చిరుతో చిందులు వేయనుంది. సినిమాకి వరసలు, బంధుత్వాలు లేకపోయినా కొడుకు, తమ్ముడు, మేనల్లుడితో హీరోయిన్‌గా నటించిన శ్రుతిహాసన్‌ని చిరంజీవికి జోడీగా ఎంపికపై విమర్శలు వినిపిస్తున్నాయి. తన తండ్రి కమల్ హాసన్ సమకాలికుడు ఏడు పదుల వయస్సు దగ్గరపడుతున్న చిరంజీవి తన కూతురి వయస్సున్న శ్రుతిహాసన్‌తో నటించడం సినిమాకి మైనస్ మారుతుందనే ఆందోళనలు ఉన్నాయి.

చిరంజీవి కంటే తానేమీ తక్కువ తిన్నానా అంటూ బాలక్రిష్ణ కూడా తన వయస్సు అరవై దాటినా ఇరవై ఏళ్ల పడుచుపిల్లలనే హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటున్నారు. కమల్ హాసన్ సమకాలికుడైన బాలయ్య కూడా తన వీరసింహారెడ్డి మూవీలో ఆయన కుమార్తె శ్రుతిహాసన్‌తో జోడి కట్టారు. బాబాయ్ బాలయ్యకి జోడీగా నటిస్తున్న శ్రుతి..అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య మూవీలో హీరోయిన్. తండ్రి వయస్సు హీరోలు, తనయ వయస్సు హీరోయిన్లు టాలీవుడ్‌కే ప్రత్యేకం.

Tags:    
Advertisement

Similar News