ప్రత్యర్ధులను విమర్శించేందుకు సినీ ప్రముఖులను వాడుకోకండి : నాగార్జున

రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండని హీరో నాగార్జున ట్విటర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

Advertisement
Update:2024-10-02 18:09 IST

మాజీ మంత్రి కేటీఆర్ వల్లనే సమంత-నాగచైతన్య విడిపోయారని మంత్రి కొండా సురేఖ ఆరోపణలను హీరో నాగార్జున ఖండించారు. ప్రత్యర్థులను విమర్మించేందుకు సినిమా వారిని వాడుకోద్దని నాగ్ కోరారు. సాటి మనుషుల పర్సనల్ విషయాలను గౌరవించండి.. బాధ్యత గల పదవిలో మహిళగా మీరు చేసిన కామెంట్స్ మా ఫ్యామిలీ పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్దం అబద్దం తక్షణమే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతున్నాను అని నాగ్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ఎన్ కన్వెన్షన్ హల్ కూల్చకుండా ఉండటానికి సమంతను పంపమని కేటీఆర్ అడిగాడు అని.. దానికి నాగార్జున, చైతన్య ఒప్పుకున్న సమంత ఒప్పుకోకపోవడంతోనే విడాకులు జరిగాయి అని సురేఖ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై నాగార్జున ట్విటర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

Tags:    
Advertisement

Similar News