దొంగలున్నారు జాగ్రత్త.. ట్రయిలర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ లోకి మరో డిఫరెంట్ మూవీ వచ్చింది. దొంగలున్నారు జాగ్రత్త అనే టైటిల్ తో థ్రిల్లర్ జానర్ లో వస్తోంది ఈ సినిమా. తొలి తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ గా ఇది ఇప్పటికే పేరు తెచ్చుకుంది.

Advertisement
Update:2022-09-16 08:58 IST

ఇప్పటివరకు ఎన్నో థ్రిల్లర్ సినిమాలు చూశాం. కానీ దొంగలున్నారు జాగ్రత్త సినిమా మాత్రం కాస్త ప్రత్యేకమైన థ్రిల్లర్ అంటున్నారు మేకర్స్. దీనికి సర్వైవల్ థ్రిల్లర్ అనే పేరు పెట్టారు.

సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కింది ఈ సినిమా. శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ కు సతీష్ త్రిపుర దర్శకత్వం వహించాడు. కాలభైరవ సంగీతం అందించాడు. సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

ట్రయిలర్ చూస్తే, ఈ కథ మొత్తం ఓ కారు చుట్టూ తిరుగుతుందనే విషయం అర్థమౌతోంది. కారు దొంగతనం చేయాలనుకుంటాడు హీరో. తన తెలివితేటలతో డోర్ ఓపెన్ చేసి లోపలకి వెళ్తాడు. ఇక కారు కొట్టేయడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో కారు లాక్ అయిపోతుంది. స్టార్ట్ అవ్వదు, డోర్ తెరుచుకోదు.

హీరోను కారులో లాక్ చేసిన విలన్, అతడ్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ కారు నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడనేది దొంగలున్నారు జాగ్రత్త సినిమా స్టోరీ.

ఎప్పట్లానే కాలభైరవ తన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. విలన్ పాత్ర పోషించిన సముత్తరఖనిని మాత్రం ట్రయిలర్ లో చూపించలేదు. ట్రయిలర్ లో విజువల్స్ బాగున్నాయి. కాలభైవర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. 23న థియేటర్లలోకి వస్తున్న ఈ సరికొత్త కాన్సెప్ట్ థ్రిల్లర్, ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.


Full View


Tags:    
Advertisement

Similar News