విడాకులు దురదృష్టకరం.. చైతూ ఇప్పుడు హ్యాపీ.. నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్..!

నాగచైతన్య ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నాడని..నాకు అది చాలు అని నాగార్జున అన్నాడు. అది జీవితంలో ఒక అనుభవం అని.. అయితే అది విడాకుల దాకా వెళ్లడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Advertisement
Update:2022-09-15 15:57 IST

నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం ఎంత సంచలనం సృష్టించిందో.. వారి విడాకుల వ్యవహారం కూడా అంతే సంచలనం సృష్టించింది. చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి నెలలు గడుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించి హాట్ టాపిక్ ఇంకా నడుస్తూనే ఉంది. విడాకుల వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు తరచూ చైతన్యకు, సమంతకు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా చైతూ, సమంత విడాకులపై ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

నాగార్జున ఇటీవల బ్రహ్మాస్త్రం అనే హిందీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ లో నాగార్జున పాల్గొనగా చైతన్య, సమంతల విడాకుల వ్యవహారంపై ఒక ప్రశ్న ఎదురైంది. 'నాగచైతన్య సినీ కెరీర్ కు సంబంధించి కాకుండా.. అతడి వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.. ఇది తండ్రిగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుందా? అని అడిగిన ప్రశ్నకు నాగార్జున బదులిచ్చాడు.

నాగచైతన్య ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నాడని..నాకు అది చాలు అని నాగార్జున అన్నాడు. అది జీవితంలో ఒక అనుభవం అని.. అయితే అది విడాకుల దాకా వెళ్లడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చో లేమన్నారు. అలా జరిగిపోయిందని..మా జీవితాల నుంచి వెళ్ళిపోయిందని.. ఎవరి జీవితంలో ఇలా జరిగిన దాని నుంచి బయటపడాలని నాగార్జున కామెంట్స్ చేశాడు. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నప్పటినుంచి ఈ అంశంపై నాగార్జున పెద్దగా స్పందించింది లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

Tags:    
Advertisement

Similar News