దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు.
Advertisement
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వీరితో పాటు ఐటీ శాఖకు సంబంధించిన మహిళా అధికారి వెళ్లారు. మూడోరోజు ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజుతో పాటు, పుష్ప2 డైరెక్టర్ సుకుమార్, మ్యాంగో కంపెనీ అధినేత రామ్ వీరపనేని కంపెనీలపై సైతం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు, రాజకీయాల్లో కూడా ఈ అంశం హాట్ టాపిక్ గా మరింది.ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement