Telugu Film Producer Council Elections: నిర్మాతల మండలి ఎన్నికల్లో దిల్ రాజ్ మద్దతుదారు విజయం
Telugu Film Producer Council Elections: ఈ ఎన్నికల్లో జెమిని కిరణ్‌పై దామోదరప్రసాద్ విజయం సాధించారు. నిర్మాతల మండలి అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 678 ఓట్లు పోలవ్వగా దామోదరప్రసాద్‌కు 339 ఓట్లు వచ్చాయి.
తెలుగు సినిమా నిర్మాత మండలి ఎన్నికల్లో కేఎల్ దామోదర ప్రసాద్ విజయం సాధించారు. 2023-25 నూతన కార్యవర్గం కోసం ఎన్నికలు జరిగాయి. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు మీడియాకెక్కి విమర్శలు కూడా చేసుకున్నారు. దామోదరప్రసాద్‌కు నిర్మాత దిల్‌రాజు మద్దతు ఇచ్చారు. జెమిని కిరణ్ వైపు సి. కల్యాణ్ తదితరులు నిలిచారు.
ఈ ఎన్నికల్లో జెమిని కిరణ్‌పై దామోదరప్రసాద్ విజయం సాధించారు. నిర్మాతల మండలి అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 678 ఓట్లు పోలవ్వగా దామోదరప్రసాద్‌కు 339 ఓట్లు వచ్చాయి. జెమిని కిరణ్‌కు 315 ఓట్లు వచ్చాయి. దాంతో దామోదర ప్రసాద్ 24 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ, అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా రామసత్యనారాయణ, సెక్రటరీగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి ఎన్నికయ్యారు.
జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టికుమార్ విజయం సాధించారు. ఈసీ మెంబర్లుగా దిల్ రాజు (470 ఓట్లు), దానయ్య (421 ఓట్లు), రవి కిషోర్ ( 419), యలమంచలి రవి (416) ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్స్‌గా పద్మిని, బెక్కం వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, గోపినాథ్ ఆచంట, మధుసూదన్ రెడ్డి, కేశవరావు, శ్రీనివాస్ వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్, కిషోర్ పూసలు తదితరులు ఎన్నికయ్యారు.
నిర్మాతల మండలికి ఆఖరి సారిగా 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. పలువురు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించారు.