LGM Movie - ధోనీ నిర్మాతగా సినిమా రెడీ, తెలుగులో కూడా రిలీజ్!
Dhoni's LGM Movie - తొలిసారి నిర్మాతగా మారాడు ధోనీ. LGM అనే సినిమా తీశాడు. ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు.
ఇండియన్ క్రికెట్ హిస్ట్రరీలో సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందించాడు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను, రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని నిర్మిస్తున్నారు.
సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంటోంది. త్వరలోనే ట్రైలర్‌ను, ఆడియో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని పాల్గొంటారు.
కుటుంబమంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందించారు. LGM అంటే లెట్స్ గెట్ మ్యారీడ్. సినిమా నవ్విస్తూనే ప్రేక్షకుల గుండెలను తాకుతుందని చెబుతున్నారు మేకర్స్. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు మ్యూజిక్‌ను కూడా అందించాడు. యోగి బాబు, మిర్చి విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.