Sir/Vaathi movie trailer review: సర్ మూవీ ట్రయిలర్ రివ్యూ

Dhanush's Sir/Vaathi movie trailer review: ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా సర్. ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

Advertisement
Update:2023-02-09 10:24 IST

Sir/Vaathi movie trailer review: సర్ మూవీ ట్రయిలర్ రివ్యూ

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు)/‌ 'వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.

స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో 'సార్'(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

'సార్' మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చదువుని వ్యాపారంగా చేసుకొని పేద విద్యార్థులకు చదువు అందకుండా చేస్తూ పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న వ్యక్తులపై హీరో సాగించే పోరాటమే 'సార్'. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున కొన్ని ప్రభుత్వ కళాశాలను దత్తత తీసుకుంటారు. అక్కడికి ఫ్యాకల్టీగా హీరో వెళ్తాడు. హాస్యం, ప్రేమ సన్నివేశాలతో సరదాగా సాగిపోతున్న కథలో.. కొందరి స్వార్థం కారణంగా పేద విద్యార్థులకు చదువు దూరమయ్యేలా కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ విద్యార్థుల తరపున సార్ ఎలా పోరాటం సాగించాడనేది ఆసక్తిగా ట్రయిలర్ లో చూపించారు.

"డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు..కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది" వంటి డైలాగ్స్ బాగున్నాయి. యువరాజ్ కెమెరా పనితనం, జి.వి. ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం బాగున్నాయి. 


Full View


Tags:    
Advertisement

Similar News