బాలీవుడ్ నటుడు మిథున్‌ చక్రవర్తికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

సినీ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకు నటుడు మిథున్‌ చక్రవర్తి ఎంపికైనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement
Update:2024-09-30 10:44 IST

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. అక్టోబర్‌ 8న జరగనున్న నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌లో తెలిపారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన మిథున్‌ చక్రవర్తి.. బాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

హీరోగానే కాకుండా సహాయనటుడు, విలన్‌గా కూడా ఆయన ఎంతోమంది సీనియర్ హీరోల మూవీస్‌లో యాక్ట్ చేశారు. 1976లో ‘మృగాయ’తో నటుడిగా అరంగేట్రం చేశారు.. పస్ట్ మూవీతోనే బెస్ట్ హీరోగా నేషల్ అవార్డు అందుకున్నారు. ‘ముక్తి’, ‘బన్సారీ’, ‘అమర్‌దీప్‌’, ‘ప్రేమ్‌ వివాహ్‌’, ‘భయానక్‌’, ‘కస్తూరి’, ‘కిస్మత్‌’, ‘మే ఔర్‌ మేరా సాథి’, ‘సాహాస్‌’, ‘వాంటెడ్‌’, ‘బాక్సర్‌’, ‘త్రినేత్ర’, ‘దుష్మన్‌’, ‘దలాల్‌’, ‘భీష్మ’, ‘సుల్తాన్‌’, ‘గురు’, ‘కిక్‌’, ‘బాస్‌’, డిస్కోడాన్సర్‌ వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. హిందీ, బెంగాలీ చిత్రాలతోపాటు కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్‌పురి చిత్రాల్లోనూ ఆయన నటించారు. ‘గోపాల గోపాల’తో టాలీవుడ్‌కి పరిచయం అయినారు.

Tags:    
Advertisement

Similar News