Committee Kurrollu | కమిటీ కుర్రోళ్లు తాజా వసూళ్లు

Committee Kurrollu - నిహారిక నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమా తాజా వసూళ్లు చూద్దాం.

Advertisement
Update: 2024-08-14 17:02 GMT

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం అన్ని ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించ‌టం విశేషం.

‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు నాలుగు రోజుల్లో రూ. 7.48 కోట్లు వచ్చాయి. దీంతో ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైంది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ ఆడియన్స్ కు అందించింది.

సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు నిర్మాత నిహారిక. చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, రానా లాంటి నటులు చేసిన ప్రచారం ఈ సినిమాకు కలిసొచ్చింది. 

Tags:    
Advertisement

Similar News