తిరుమలలో కలర్‌ఫొటో దర్శకుడి పెళ్లి
వివాహ బంధంతో ఒక్కటైన సందీప్ రాజ్, చాందిని రావు
Advertisement
తిరుమల శ్రీవారి చెంత కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్, హీరోయిన్ చాందిని రావు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. సుహాస్ హీరోగా సందీప్ రాజ్ తెరకెక్కించిన కలర్ ఫొటో సూపర్ హిట్ అయ్యింది. తెలుగు సినిమా విభాగంలో నేషనల్ అవార్డు దక్కించుకుంది. సందీప్, చాందిని ఎంగేజ్‌మెంట్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగింది.
Advertisement